NTV Telugu Site icon

Nagababu: అల్లు ఆర్మీ దెబ్బ.. ట్విట్టర్ డీ యాక్టివేట్ చేసిన నాగబాబు!

Nagababu

Nagababu

Nagababu Deactivated his Twitter Account: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం అల్లు అర్జున్ అభిమానులే అని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నిజానికి అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి ట్విట్ చేశాడు అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ ఎవరికి తగినట్లుగా వారు దానిమీద స్పందిస్తూ పెద్ద రాద్ధాంతమే చేశారు. కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల వెళ్లడంతో అల్లు అర్జున్ ని ఉద్దేశించి నాగబాబు ట్వీట్ చేశాడంటూ పెద్ద దుమారమే రేగింది.

Suchitra: హీరోయిన్ ఇంట్లో బూతు సినిమాల షూటింగ్… సుచిత్ర మరో సంచలనం

అల్లు అర్జున్ అభిమానులు సైతం నాగబాబుని టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. అయితే ఈ వివాదం ముదరడంతో నాగబాబు తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఆయన కోసం మెగా హీరోలు చాలామంది వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. అల్లు అర్జున్ కేవలం పవన్ కళ్యాణ్ కోసం సోషల్ మీడియా పోస్ట్ కి మాత్రమే పరిమితమయ్యారు. అయితే తన స్నేహితుడిగా చెప్పుకుంటున్న నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం మాత్రం స్వయంగా వెళ్లి తన స్నేహితుడికి ఓటు వేయాల్సిందిగా కోరారు. ఈ అంశం మీద అటు మెగా అభిమానులకు ఇటు అల్లు అభిమానులకు మధ్య కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్ల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు నాగబాబు సోషల్ మీడియా అకౌంట్ డి ఆక్టివేట్ చేయడం చర్చనీయాంశమైంది.

Show comments