Nagababu: గుండెపోటుతో NRI మృతి.. తీవ్ర శోకానికి గురిచేసిందంటూ నాగబాబు ట్వీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagababu Comments on NRI Janasena Follower Death: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకపక్క ఎన్నికల వేడి కొనసాగుతుంటే మరొక పక్క సూర్యుడి భగభగలు సెగలు రేపుతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చాలా మంది అస్వస్థత బారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే తాజాగా జనసేనకు చెందిన ఒక ఎన్నారై ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత నాగబాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పెడనకి చెందిన కరుడుగట్టిన కమిటడ్ NRI జనసైనికుడు కటకం విజయ్ కుమార్ జనసేన తరపున ప్రచారం చేస్తుండగా గుండెపోటుతో మరణించడం తీవ్ర శోకానికి గురిచేసింది.
Jr NTR: టీడీపీ ర్యాలీలో ఎన్టీఆర్ కి పాలాభిషేకం
Also Read
జనసేన మీద అమితమైన ప్రేమతో ‘అమెరికా’ నుంచి వచ్చి బాలశౌరి, కొల్లు రవీంద్ర, బండి రామకృష్ణతో NDA కూటమి తరపున పిఠాపురం, మచిలీపట్నం, తిరుపతి & పెడన లో ప్రచారం చేశారు, ఆయన ‘జనసేన’ గెలుపు కోసం పని చేశారు కానీ కనీసం జనసేనానిని కలవాలని కూడా అనుకోలేదు. ఇలాంటి Dedicated జనసైనికున్ని కోల్పోవడం కలిచివేస్తుంది, త్వరలోనే అధినేత పవన్ కళ్యాణ్ తో నేను కూడా వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తాం, ఇలాంటి వ్యక్తులని కోల్పోవడం వారి కుటుంబానికే కాదు జనసేన పార్టీకి కూడ తీరని లోటు,వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని నాగబాబు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచార హోరు పెద్ద ఎత్తున కొనసాగుతోంది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు తమ బలపరిచే వారితో కలిసి ప్రచారాలు చేస్తున్నారు.
NRI విజయ్ కుమార్ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది :
పెడనకి చెందిన కరుడుగట్టిన కమిటడ్ NRI జనసైనికుడు కటకం విజయ్ కుమార్ గారు జనసేన తరపున ప్రచారం చేస్తుండగా గుండెపోటుతో మరణించడం తీవ్ర శోకానికి గురిచేసింది,
జనసేన మీద అమితమైన ప్రేమతో 'అమెరికా' నుంచి వచ్చి బాలశౌరి,కొల్లు… pic.twitter.com/cBsqqVFB1O
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 30, 2024
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Jensen Huang: ఎన్విడియా సీఈఓగా తిరిగి జెన్సన్ హువాంగ్ నియామకం..
-
UP Crime: అక్క భర్తతో ప్రేమాయణం.. పెళ్లికి అడ్డుగా ఉందని తల్లిని చంపేసింది!
-
NIMS : నిమ్స్‌లో ఏసీబీ షాకింగ్ తనిఖీలు.. చనిపోయిన రోగుల పేరుతోనూ బిల్లులు!
-
Sourav Ganguly: మీకేమైనా మైండ్ పని చేస్తుందా..? టెస్టు డ్రాపై గంగూలీ కీలక వ్యాఖ్యలు..
-
CM Revanth Reddy : కృష్ణా జలాలపై హరీష్ రావుకు రేవంత్ సవాల్.. లెక్కలతో తేల్చుకుందామా?
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!