Site icon NTV Telugu

Nagababu: నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి అంటూ ప్రచారం.. అసలు విషయం చెప్పేశాడు!

Nagababu

Nagababu

Nagababu Clarity on TTD Chairman Post: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం -బిజెపి – జనసేన కూటమి భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే క్యాబినెట్లో జనసేన మంత్రులు ఎంతమంది ఉంటారు? బీజేపీ మంత్రులు ఎంతమంది ఉంటారు? అనే విషయం మీద ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి టీటీడీ చైర్మన్ పదవి లభించబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. నిజానికి నాగబాబు గతంలో ఒక వీడియోలో తాను నాస్తికుడు అని చెప్పారు. అయితే ఇప్పుడు నాస్తికుడికి టిటిడి చైర్మన్ పదవి ఎలా ఇస్తారని చర్చ మొదలైంది. నిజానికి అసలు టిటిడి చైర్మన్ గురించి నాగబాబుతో ఎలాంటి చర్చలు జరగలేదని చెబుతూ ఈ విషయాన్ని నాగబాబు స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Kangana : కంగనా చెంప పగలకొట్టిన కానిస్టేబుల్.. సెల్ఫీ వీడియో రిలీజ్!

దయచేసి ఎలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దు, సోషల్ మీడియాలో అఫీషియల్ గా పార్టీ నుంచి వచ్చే పార్టీ హ్యాండిల్స్ నుంచి మాత్రమే మీకు నిజమైన సమాచారం అందుతుంది. లేదా నా వెరిఫైడ్ సోషల్ మీడియా అకౌంట్లో కూడా మీకు ఆ సమాచారం అందిస్తాను. ఇవి తప్ప ఇతర ఫేక్ న్యూస్ మీరు నమ్మకండి అంటూ ఆయన సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు నిజానికి టిటిడి చైర్మన్ పదవి నిర్మాత అశ్వినీ దత్ కి కూడా లభించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు నాగబాబు పేరు తెరమీదకు వచ్చింది. అయితే నిజానికి నాగబాబు గత ఎన్నికలలో అనకాపల్లి నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే సీట్ల సర్దుబాటులో భాగంగా ఆ సీటుని బిజెపి నుంచి సీఎం రమేష్ దక్కించుకున్నారు. నాగబాబు ప్రత్యక్షంగా ఎక్కడా పోటీ చేయకపోయినా జనసేన ప్రచార కార్యక్రమాలలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు ఏదైనా కీలక పదవి లభిస్తుందని ప్రచారం అయితే ముందు నుంచి ఉంది. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

Exit mobile version