Kingdom : నాగవంశీ మీడియా ముందుకు వస్తే ఏదో ఒక సెటైరికల్ కామెంట్ తప్పనిసరి. తాజాగా కింగ్ డమ్ థాంక్స్ మీట్ లోనూ అలాంటిదే వేసేశాడు. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. నేడు ఈసినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ థాంక్స్ మీట్ ను తాజాగా నిర్వహించారు. ఇందులో మూవీ విశేషాలను పంచుకున్నారు. విజయ్ మాట్లాడుతూ ‘నేను ఈ సినిమా కోసం కష్టపడ్డందుకు ఫలితం దక్కింది. ఏడుకొండల వెంకన్న స్వామి కరుణించాడు. ఇప్పటి వరకు చూసిన వారంతా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతలోనే మూవీలో హృదయం సాంగ్ ఎందుకు తీసేశారని రిపోర్టర్ ప్రశ్నించారు.
Read Also : Deva Katta : రాజమౌళి సినిమాతో నాకు సంబంధం లేదు.. దేవాకట్టా క్లారిటీ
దానికి నాగవంశీ స్పందిస్తూ.. ‘మూవీలో అసలు స్పేస్ లేదు. కావాలంటే మీరు సినిమా చూడండి. ఎక్కడైనా ఆ సాంగ్ పెట్టే సిచ్యువేషన్ ఉంటే చెప్పండి. కచ్చితంగా పెడుతాను. చాలా మంది హృదయం సాంగ్ ఎందుకు పెట్టలేదని అంటున్నారు. అంటే వారంతా విజయ్ కిస్ సీన్ మిస్ అవుతున్నట్టు ఉన్నారు’ అని సెటైర్ వేసేశాడు నాగవంశీ. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హీరోయిన్ పాత్ర సెకండ్ పార్ట్ లోనే ఎక్కువగా ఉంటుందని.. అందుకే ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ ఎక్కువ సేపు ఉండదంటూ తెలిపాడు నాగవంశీ.
Read Also : Kingdom : కింగ్ డమ్ పార్ట్-2 వచ్చేది అప్పుడే.. నాగవంశీ క్లారిటీ
