NTV Telugu Site icon

Naga Vamsi: పూజా హెగ్డే మీద కన్నేశాడు.. వైరల్ అవుతున్న నాగవంశీ కామెంట్స్

Pooja Hegde

Pooja Hegde

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 గ‌త వారం ప్రారంభ‌మైంది. మొదటి ఎపిసోడ్ లో చంద్రబబు సందడి చేశారు. ఆహాలో ఈ మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రెండో ఎపిసోడ్‌కు ఎవ‌రు వ‌స్తారా ? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న క్ర‌మంలో రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వ‌చ్చేసింది. రెండో ఎపిసోడ్‌కు ల‌క్కీ భాస్క‌ర్ మూవీ టీమ్ సెకండ్ ఎపిసోడ్ లో సందడి చేసింది. హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌద‌రి, ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగ వంశీలు ఈ షోలో కనిపించారు. ఇక ప్రోమో ప్రారంభంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో ఎంట్రీ ఇవ్వగా గడ్డు కాలం ఎదురొచ్చినా, చెడ్డవాడు ఎగేసుకొచ్చినా అనే డైలాగ్‌ను త‌న‌దైన శైలిలో చెప్పి అలరించారు.

Jai Hanuman First Look: ‘జై హనుమాన్’ వస్తున్నాడు!

ఇక తరువాత దుల్కర్ సల్మాన్ స్టేజ్ పైకి రాగానే ఏంటి ఈ గ్లామర్ నన్ను నేను చూసుకున్న‌ట్లుగా ఉంది అని దుల్కర్‌తో బాల‌య్య అనగా ఆయన సిగ్గు పడుతూ కనిపించారు. ఇక మరోపక్క ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎవరైనా హీరోయిన్ తో సినిమా చేయాలి అని ఏమైనా ఉందా అని వెంకీ అట్లూరిని అడిగితే దానికి నాగవంశీ స్పందిస్తూ వెంకీకి ఎప్పటినుంచో పూజా హెగ్డేపై కన్నుందని అన్నాడు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే దాదాపు ప్రమోషన్స్ ను వేగంగా చేస్తూ అందులో భాగంగానే ‘అన్‌స్టాపబుల్’ షోలో పాల్గొన్నారు.

Show comments