NTV Telugu Site icon

Naga Vamshi: ఆ షో వేసి తప్పు చేశా… సలార్ కి దీనికి ఉన్న తేడా అదే

Naga Vamshi

Naga Vamshi

గుంటూరు కారం… సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లాస్ట్ రీజనల్ సినిమా. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ అనగానే గుంటూరు కారం సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ప్రొడ్యూసర్ నాగ వంశీ తన మాటలతోనే హైప్ క్రియేట్ చేసాడు. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసి జనవరి 12న రిలీజైన గుంటూరు కారం సినిమా డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. క్రిటిక్స్ నుంచి కూడా గుంటూరు కారం సినిమాకి యావరేజ్ రివ్యూస్ వచ్చాయి. క్రిటిక్స్ ఒపీనియన్స్ అండ్ రివ్యూస్ ని పక్కన పెడితే గుంటూరు కారం సినిమా టాక్ కి భిన్నంగా కలెక్షన్స్ ని రాబడుతోంది. మొదటివారం లోనే 212 కోట్లు రాబట్టి 90% బిజినెస్ ని రికవర్ చేసేసింది. గుంటూరు కారం సినిమాకి ఈ స్థాయి కలెక్షన్స్ వస్తాయని కూడా ఎవరు ఊహించి ఉండరు. అయితే మహేష్ చరిష్మా మాత్రమే గుంటూరు కారం సినిమాని నిలబెడుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబుకి ఉన్న గ్రిప్ గుంటూరు కారం సినిమాకి హెల్ప్ అయ్యింది.

గుంటూరు కారం సినిమా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా ప్రొడ్యూసర్ నాగ వంశీ ప్రెస్ మీట్ పెట్టి మొదటిరోజు నెగటివ్ టాక్ రావడానికి కారణం ఏంటో చెప్పేసాడు. గుంటూరు కారం సినిమాకి అర్ధరాత్రి 1కి కొన్ని చోట్ల షోస్ పడ్డాయి. ఈ షోస్ కారణంగానే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది కానీ ఆ తర్వాత సినిమా పుంజుకుంది. ఆ షో వేయడం కారణంగానే ఇదంతా జరిగింది. సలార్ సినిమా మాస్ సినిమా కాబట్టి ఆడియన్స్ చూసారు. ఇది ఫ్యామిలీ సినిమా కాబట్టి అర్ధరాత్రి షో వేయకుండా ఉండాల్సింది. సినిమా ఆ తర్వాత మళ్లీ పాజిటివ్ గా టర్న్ అయ్యింది కానీ మేము ఆశించిన స్థాయిలో రాలేదు. కొంతమంది గుంటూరు కారం సినిమా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు. ఈ సినిమాకి ఇంత కలెక్షన్స్ రావు అని వాళ్ళు ఊహించారు, డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా ఫోన్లు చేసారు, వాళ్లందరికి చెప్తున్నా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది, అందుకే ప్రెస్ మీట్ పెట్టా” అని చివరలో చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు నాగ వంశీ.