సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన మూడో సినిమా గుంటూరు కారం. జనవరి 12న రిలీజైన ఈ మూవీకి ఫస్ట్ నుంచి నాగ వంశీ తన మాటలతోనే ప్రమోషన్స్ చేస్తూ వచ్చాడు. రిలీజ్ రోజున కాస్త నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి రావడంతో గుంటూరు కారం 90% బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యింది. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే సరికి గుంటూరు కారం సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిపోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నాగ వంశీ ప్రెస్ మీట్ పెట్టి మరీ సోషల్ మీడియాలో, కొన్ని మీడియా పేజెస్ చెప్తున్న కలెక్షన్స్ లో నిజం లేదు. సినిమా చాలా బాగా రన్ అవుతోంది అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ మొదలైన రచ్చ నిన్న అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది.
ఒక వెబ్ పేజ్ కి సంబందించిన సోషల్ మీడియా అకౌంట్ నుంచి గుంటూరు కారం కలెక్షన్స్ లో 45% ఫేక్ ఉన్నాయి అనే దగ్గర స్టార్ట్ అయిన రచ్చ నాగ వంశీ… నువ్వు గుంటూరు కారం ప్రొడ్యూసర్ తో మాట్లాడుతున్నావ్, నీ సోర్స్ అనేదే తప్పు. ఒక సినిమా కలెక్షన్స్ విషయంలో ప్రొడ్యూసర్ కి మాత్రమే ఒరిజినల్ ఫిగర్స్ తెలుస్తాయి. మిగిలిన వాళ్లు చెప్పే ఏ నంబర్స్ లో నిజం ఉండదు అంటూ ఘాటుగానే రెస్పాండ్ అయ్యాడు. సదరు వెబ్ సైట్ ఏరియా వైస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ ఇచ్చి మీ కలెక్షన్స్ నిజం అని ప్రూవ్ చేయొచ్చు కదా అనడంతో నాగ వంశీ… మీరు అదే పాత పాట పడుతున్నారు. కలెక్షన్స్ ఫేక్ అనింది మీరు, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనేలా ట్వీట్ చేసాడు. దీంతో నాగ వంశీకి ఆ వెబ్ సైట్ కి మధ్య జరిగిన రచ్చ కాస్త ఆగింది. మరి ఇది ఇక్కడితో ఆగుతుందా లేక ఇంకా ముదురుతుందా అనేది చూడాలి.
