Site icon NTV Telugu

నవంబర్ 12వ తేదీకి ‘లక్ష్య’ పెట్టిన నాగశౌర్య!

ప్రామిసింగ్ యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం ‘లక్ష్య’ విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 12వ తేదీని అతని 20వ చిత్రమైన ‘లక్ష్య’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటోంది. ఇందులో కేతికా శర్మ కథానాయికగా నటిస్తోంది. సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావ్, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నిన్న ‘లక్ష్య’ రిలీజ్ డేట్ ఏమిటో గెస్ చేయమంటూ చిత్ర బృందం నెటిజన్స్ ను కోరుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. అందులో అక్టోబర్ 15, అక్టోబర్ 22, అక్టోబర్ 29, నవంబర్ 12 తేదీలు ఉన్నాయి. కాగా చిత్ర నిర్మాతలు నవంబర్ 12ను ఫైనల్ రిలీజ్ డేట్ గా ఎంపిక చేశారు. ఇండియన్ లో ఫస్ట్ ఆర్చరీ బ్యాక్ డ్రాప్ మూవీగా ‘లక్ష్య’ తెరకెక్కింది. ఇందులో నాగశౌర్య రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఆరు పలకల దేహంతో, పోనీ టైల్ తో విలుకాడిగా కనిపించే గెటప్ ఒకటి కాగా, దానికి భిన్నమైనది మరొకటి. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు.

విశేషం ఏమంటే… నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను’ మూవీ అక్టోబర్ 15న విడుదల కాబోతోంది. సో… అక్టోబర్ అండ్ నవంబర్ మాసాల్లో నాగశౌర్య చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ జనం ముందుకు రాబోతున్నాయన్న మాట!

Exit mobile version