Site icon NTV Telugu

Naga Shaurya: ‘కృష్ణ వ్రింద విహారి’ రిలీజ్ డేట్ లాక్!

Krishna Vihari

Krishna Vihari

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగల్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. సమ్మర్ సీజన్ లోనే మే 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగశౌర్య సూపర్ కూల్‌గా కనిపించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ కు అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట ‘వర్షంలో వెన్నెల’ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాటలో నాగ శౌర్య, షిర్లీ సెటియా కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మహతి స్వరసాగర్‌ స్వర పరిచిన ఈ పాట వీక్షకులని అమితంగా అలరించింది. డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Watch Acharya Pre release Event Live :

ఇదిలా ఉంటే.. మే 20న ఇప్పటికే మూడు సినిమాలు విడుదల కాబోతున్నట్టు ప్రకటనలు వచ్చాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ‘పెళ్ళికూతురు పార్టీ’తో పాటు, సత్యదేవ్ ‘గాడ్సే’, రాజశేఖర్ ‘శేఖర్’ చిత్రాలను మే 20న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు.

Exit mobile version