Naga Mahesh about Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేనాని అయ్యారు. జనసేన పార్టీని 2014లోనే ఆయన స్థాపించినా సరే 2024లో 21 స్థానాలను సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇక ఆయన గురించి తాజాగా నటుడు నాగ మహేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ చేస్తున్న క్రమంలో షార్ట్ గ్యాప్ లో ఫోను మాట్లాడుతూ నడుస్తూ వెళ్లారట. అక్కడ ఒక టెంట్లోకి వెళితే ప్రొడక్షన్ వర్కర్లు తినే లంచ్ చూశారని అన్నారు.
Nindha: ‘నింద’ పడితే తుడిచేదెలా? ఆసక్తికరంగా వరుణ్ సందేశ్ సినిమా ట్రైలర్
ఫోన్ మాట్లాడుతుండగానే వాళ్ళు ఏం తింటున్నారో చూసి ఫోన్ కట్ చేసి అసలు ఏంటి ఏం పెట్టారు అనేది తెలిసి షాక్ అయ్యారట. ఆ ఫుడ్ క్వాలిటీ బాలేదనే విషయం అర్థమై వెంటనే ప్రొడ్యూసర్ తో మీటింగ్ ఏర్పాటు చేసి కావాలంటే నా రెమ్యూనరేషన్లో ఒక కోటి రూపాయలు తగ్గించుకోండి కానీ ప్రొడక్షన్ వర్కర్లకు అంత దారుణమైన ఫుడ్ పెట్టొద్దు. నేనేం తింటానో వాళ్లకు కూడా అదే ఫుడ్ పెట్టండి అంటూ ఆదేశాలు జారీ చేశారట. ఈ విషయం చెబుతూ నాగ మహేష్ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ క్రమంలో అందుకే కదా పవర్ స్టార్ అయ్యేది, ఊరికే అయిపోతారా అంటూ ఆయన అభిమానులు అయితే కామెంట్ చేస్తున్నారు.