NTV Telugu Site icon

Naga Chaitanya : త్వరలోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్న నాగ చైతన్య..?

Whatsapp Image 2023 07 09 At 6.30.33 Pm

Whatsapp Image 2023 07 09 At 6.30.33 Pm

నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అక్కినేని హీరో గా సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ మధ్య నాగచైతన్య కు టైం అస్సలు కలిసి రావడం లేదు. ఆయన చేసిన థాంక్యూ అలాగే హిందీ డెబ్యూ సినిమా అయిన లాల్ సింగ్ చద్దా వరుసగా ప్లాప్ అవ్వడం జరిగింది.అలాగే తాజాగా నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వం లో కస్టడీ సినిమా చేయగా ఇది కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. కస్టడి సినిమా తర్వాత నాగ చైతన్య ఎలాంటి సినిమా చేస్తాడు అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకు అఫిషియల్ అప్డేట్ అయితే రాలేదు. అయితే తన తరువాత సినిమా కార్తికేయ 2 వంటి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన చందు మొండేటితో చేయబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకం గా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను 60 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే నిఖిల్ వంటి యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా స్థాయి లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు..అలాగే నాగ చైతన్య కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయబోతున్నాడని సమాచారం.ఇప్పటికే చందూ మొండేటి కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. అలాగే నాగ చైతన్య తో కలిసి ప్రేమమ్ మరియు సవ్యసాచి వంటి సినిమాలు చేసారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.. ఇప్పుడు మరో సారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి లో తెరకెక్కబోతుంది. ఈ సారి అయిన నాగ చైతన్య కు ఆశించిన విజయం లభిస్తుందో లేదో చూడాలి.