Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇక ఇటీవలే లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చై.. సినిమా ప్రమోషన్స్ లో అందరికంటే ఎక్కువగా పాల్గొంటున్నాడు. అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా విజయాన్ని అందుకోకపోయినా చైతూ పాత్రకు మాత్రం మంచి గుర్తింపే లభిస్తోంది. ఇక తాజాగా చైతన్య నెపోటిజం పై నోరు విప్పారు.
తాతలు, తండ్రులు నుంచి వస్తున్నా వారసత్వంపై మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు చై మాట్లాడుతూ “బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో నెపోటిజం తక్కువనే చెప్పాలి. మా గురించి చెప్పాలంటే.. మా తాత నటుడే.. మా నాన్న నటుడే. ఎంత కాదనుకున్నా వారి ప్రభావం మా మీద పడుతోంది. వారిని చూశాకే నేను నటుడును అవ్వాలనుకున్నాను. వారి వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఈజీగానే వచ్చాను కానీ ఒక హీరోగా నిలబడడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నాను. ఇప్పుడు చూడండి. ఒకేరోజు నాది, ఒక సెల్ఫ్ మేడ్ హీరో ది సినిమాలు రిలీజ్ అయ్యి.. నాకు రూ. 10 కోట్లు మాత్రమే వచ్చి, అతని సినిమా రూ. 100 కోట్లు సాధించింది అంటే ప్రతి నిర్మాత అతని వద్దకే వెళ్తాడు. రేపు ఈ సెల్ఫ్ మేడ్ హీరోలు వారి వారసులు ఇండస్ట్రీకి వస్తాము అంటే అడ్డు చెప్తారా..? మేము నేపోటిజాన్ని అనుభవించాం.. మీరు వద్దు అని అనరు కదా..?” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
