యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ‘తండేల్’ హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహించింది.
VD 12: విజయ్ దేవరకొండ సినిమా “వీడీ 12” టీజర్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?
సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. తెలుగు సినిమా ప్రేక్షకులకు థాంక్ యూ సో మచ్. సినిమాకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. చాలా కాలంగా ఇది మిస్ అయ్యాను. ఫైనల్ గా మళ్ళీ నాకు తిరిగివచ్చింది. మార్నింగ్ షో నుంచి సూపర్ హిట్ టాక్ అలా పెరుగుతూ వెళుతోంది. ఇంకా ఫ్యామిలీస్ థియేటర్స్ కి రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ కి నచ్చే ఎన్నో ఎమోషన్స్ వున్నాయి. వాళ్ళంతా వస్తే సినిమాకి ఇంకా మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. దేవిశ్రీ కి థాంక్ యూ చెప్పాలి. నా పెర్ఫార్మెన్స్ కి కాంప్లిమెంట్స్ వస్తున్నాయంటే సగం క్రెడిట్ దేవికి ఇవ్వాలి. మా ‘తండేల్’ అరవింద్ గారు. ఆయనకి, వాసుకి, చందుకి ఎంత థాంక్స్ చెప్పినా సరిపోదు. అందరూ నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇదంతా టీం వర్క్. అందరికీ థాంక్ యూ. అందరూ థియేటర్స్ కి వెళ్లి సినిమాని ఎంజాయ్ చేయండి’ అన్నారు.