NTV Telugu Site icon

Naga Chaitanya: డిన్నర్ కి వెళ్లిన చై-శోభిత… సోషల్ మీడియాలో ఫోటో వైరల్

Naga Chaitanya

Naga Chaitanya

అక్కినేని నాగ చైతన్య, సమంతాలు 2021 అక్టోబర్ లో డివోర్స్ తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోయి ప్రస్తుతం ఎవరి లైఫ్స్ వాళ్లు లీడ్ చేస్తున్నారు. సమంతా తన సినిమాలతో బిజీగా ఉంటే, చైతన్య తన కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. అయితే సామ్ తో విడిపోయిన తర్వాత నాగ చైతన్య  శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రూమర్స్ చై, శోభిత వరకూ వెళ్ళాయి కానీ ఇద్దరూ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. గత కొన్ని రోజులుగా చైతన్య ఇంట్లోనే శోభిత కూడా ఉంటుందనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజముంది అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం ట్విట్టర్ లో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ డిన్నర్ కి వెళ్లిన ఒక ఫోటో మాత్రం వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫోటో ఇప్పటిది కాదు ఫిబ్రవరి నెలలో చెఫ్ సురేంద్ర మోహన్ నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ ఫోటో ఫోర్ గ్రౌండ్ లో నాగచైతన్య, చెఫ్ సురేంద్ర మోహన్ ఉండగా బ్యాక్ గ్రౌండ్ లో కుర్చీలో కూర్చోని శోభిత కనిపించింది. దీంతో అప్పటి ఫోటో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. నిజానికి ఈ ఫోటో ఫిబ్రవరిలో దిగినది కూడా కాదు. గత నవంబర్ లో చై-శోభితలు లండన్ ట్రిప్ వెళ్లారు అనే న్యూస్ ఎక్కువగా వినిపించింది. ఆ సమయంలో దిగిన ఫోటో ఇది. లండన్‌లోని జమావార్‌లో హోటల్ లో డిన్నర్ కి చైతన్య-శోభిత కలిసి వెళ్ళగా ఆ సమయంలో తీసిన పిక్ ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది అనే విషయం తెలియాల్సి ఉంది. సమంతా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కోసం చాలా యాక్టివ్ గా ఇంటర్వ్యూస్ అండ్ ఫోటో సెషన్స్ చేస్తున్న సమయంలో చైతన్య-శోభితల పాత ఫోటో వైరల్ అవ్వడం ఆశ్చర్యం కలిగింది.

Show comments