Site icon NTV Telugu

నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్… సామ్ తో విడిపోవడానికి రీజన్ ఇదేనా ?

Naga-Chaitanya

టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగ చైతన్య ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నాము అని ప్రకటించి షాక్ ఇచ్చినప్పటి నుంచి, ఇప్పటికీ వీళ్లిద్దరి విడాకుల విషయమే హైలెట్ అవుతోంది. అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు ? అనే విషయంపై ఇద్దరూ స్పందించకపోవడంతో పలు పుకార్లు షికార్లు చేశాయి. ఇక అప్పటి నుంచి సమంత నిత్యం ఏదో ఒక విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంది.

నాగ చైతన్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే పాత్రలు చేయడానికి ఇష్టపడనని వెల్లడించాడు. విభిన్న రకాల పాత్రలు చేయడం గురించి ఆయనను అడిగినప్పుడు చై బదులిస్తూ “నేను అన్ని రకాల పాత్రలకు చేస్తాను. అయితే ఆ పాత్రలు నా కుటుంబాన్ని, మా ప్రతిష్టను ప్రభావితం చేయకూడదు. నా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించే పాత్రలను నేను అంగీకరించను” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో చై చేసిన వ్యాఖ్యలు సామ్ కు కూడా వర్తిస్తాయి అంటూ ఆయన మాజీ భార్య సమంతను, ముఖ్యంగా ఆమె కెరీర్ లో పాత్రల ఎంపికలను ప్రస్తావిస్తున్నారు.

Read Also : ఫ్యామిలీతో ‘పుష్ప’రాజ్ సందడి @ ఆర్టీసీ క్రాస్ రోడ్స్

సామ్ ఇటీవల కాలంలో బోల్డ్ గా కన్పిస్తూ మరింత గ్లామర్ ను ఒలకబోస్తున్న విషయం తెలిసిందే. సమంత కెరీర్ నిర్ణయాలను నాగ చైతన్య, ఆయన కుటుంబం ప్రోత్సహించకపోవడమే ఈ ఇద్దరు విడిపోవడానికి కారణం అని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నా… ఇప్పుడు చై చేసిన కామెంట్స్ తో విడాకులకు ముఖ్య కారణం ఇదేనని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. వాళ్ళు విడిపోయే ముందు విడుదలైన ‘ఫ్యామిలీ మ్యాన్-2’ దీనంతటికీ కారణం అని, అందులో సామ్ తన పాత్ర గురించి కుటుంబ సభ్యులకు ముందుగా చెప్పలేదని, దీంతో విషయం విడాకుల దాకా వెళ్లిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సామ్ ఈ వెబ్ సిరీస్ లో కొన్ని ఇంటిమేట్ సీన్లలో నటించిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది అక్టోబర్ 2న నాగ చైతన్య, సమంత విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంట పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వారి విడాకుల కోసం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరు ప్రస్తుతం తమ కెరీర్‌పై దృష్టి పెట్టారు. నాగ చైతన్య… అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా”లో భాగం అయ్యాడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్, మోనా సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు విడిపోయిన తర్వాత సమంత కెరీర్‌లో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె తన మొట్టమొదటి ఐటెమ్ సాంగ్‌కు సంతకం చేసింది. అలాగే తన మొదటి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌ లో కూడా నటించబోతోంది. సమంత తన ప్రతి సినిమాతో తన పరిధిని పెంచుకుంటూ పోతోంది.

Exit mobile version