Site icon NTV Telugu

‘నాంది’ దర్శకుడితో నాగచైతన్య రెడీనా!

రెండు మూడేళ్లు సీరియల్స్‌లో, ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్‌ కనకమేడల ‘నాంది’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు. ‘అల్లరి’ నరేశ్‌ హీరోగా, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ఆకట్టుకొంది. నరేష్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా మలిచాడు విజయ్ కనకమేడల.. ప్రస్తుతం ఈ దర్శకుడు తన తదుపరి సినిమాని అక్కినేని నాగచైతన్యతో చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదివరకే విజయ్‌ కనకమేడల నరేట్ చేసిన స్టోరీకి చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కథ కొత్తగా ఉండటం, సమంతకు కూడా కథ మెచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం చైతు ‘లవ్ స్టోరీ’ సినిమాని పూర్తిచేసుకొని విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. సాయి పల్లవి కథానాయిక కాగా, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 10న థియేటర్లోకి రాబోతోంది. మరోవైపు చైతు, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘థ్యాంక్యూ’ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. మరి ఈ సినిమా తరువాత చైతు విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో చేస్తారా.. లేదా? అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే..

Exit mobile version