Site icon NTV Telugu

Nagachaitanya : ఏడాది ముందే మీడియాకి సెట్ చూపించిన నాగ చైతన్య సినిమా టీం

Nagachithanya

Nagachithanya

Nagachaitanya : నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో విరూపాక్ష సినిమా దర్శకత్వం వహించిన కార్తీక్ వర్మ, ఒక మైథలాజికల్ టచ్ ఉన్న పాత్రను నాగచైతన్యకు చెప్పడంతో అది ఆయనకు బాగా నచ్చింది. దీంతో కార్తీక్ వర్మతో సినిమా చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై పది రోజులు పూర్తయింది. అయితే, ఈ సినిమాలో ఒక కీలకమైన గుహను చూపించేందుకు తాజాగా మీడియాతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేసింది సినిమా టీం. ఈ క్రమంలోనే ఈ సినిమాలో 20 నిమిషాల పాటు కనిపించబోతున్న ఈ కీలకమైన గుహను మీడియాకి చూపించారు.

Read Also : HHVM : ‘వీరమల్లు’ రాకతో కన్నప్ప, కుబేరకు ఊహించని షాక్..?

అంతేకాక, సినిమాకి సంబంధించి పలు ప్రశ్నలకు కూడా సినిమా టీం సమాధానాలు ఇచ్చింది. ఈ సినిమాలో నాగచైతన్య ఒక ట్రెజర్ హంటర్‌గా కనిపించబోతున్నాడని, మీనాక్షి చౌదరి ఒక ఆర్కియాలజిస్ట్‌గా కనిపించబోతుందని కూడా స్పష్టత ఇచ్చారు. ఇక ఈ సినిమాకి సంబంధించి కీలకమైన గుహను ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర 50 రోజులు కష్టపడి రూపొందించినట్టు వెల్లడించారు. ఏఐ అలాగే కంప్యూటర్ గ్రాఫిక్స్ విపరీతంగా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా, సినిమాటిక్ టచ్ కోసం ఈ గుహను సిద్ధం చేసినట్లు సినిమా టీం వెల్లడించింది.

Read Also : Bihar: ‘నా భర్త మృతదేహంతో అరగంట ఉండనివ్వండి’.. జవాన్ భార్య ఆవేదన!

Exit mobile version