Naga Chaitanya Interacts with fishermen families for Chandoo Mondeti Film: అక్కినేని నాగచైతన్య ఓ సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అల్లు అరవింద్, బన్నీవాసుల గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో చైతన్య ఈ సినిమా చేయబోతున్నాడు. కార్తికేయ2 మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న డైరెక్టర్ చందూ మొండేటి ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్ చేస్తుండగా త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా నిర్మాత బన్నీ వాసు, నాగచైతన్య, చందు మొండేటి ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశం గ్రామంలో పర్యటించి వాళ్లు సముద్రంలో తప్పిపోయి పాకిస్తాన్ వెళ్లిన సంఘటనల వివరాలు తెలుసుకున్నారు. నిజానికి ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతుందని చైతన్య జాలరిగా కనిపిస్తాడని ముందే క్లారిటీ ఇచ్చారు. గుజరాత్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్టు కూడా అప్పట్లో జరిగింది. ఇక తాజాగా ఈ విషయం మీద నాగ చైతన్య మాట్లాడుతూ సుమారు ఆరు నెలల క్రితం చందూ మొండేటి నాకు ఈ కథ చెప్పారని, ఈ కథ స్ఫూర్తి నింపిందని అన్నారు.
Jailer: రజనీ ‘జైలర్’ అక్కడి నుంచే ఎత్తుకొచ్చారా?
మత్స్యకారుల జీవన స్థితిగతులను తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. ఇక ఇదే క్రమంలో బన్నీ వాసు మాట్లాడుతూ నిజ జీవితంలో జరిగిన కథను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నామని, వాస్తవిక పరిస్థితులకు దగ్గరగా చూపించనున్నామని అన్నారు. సిక్కోలు మత్స్యకారుల యాస, భాష, వ్యవహార శైలిని అర్థం చేసుకోవడం కోసం ఈ ప్రాంతానికి వచ్చామని పేర్కొన్న ఆయన ఒక మంచి లవ్‌స్టోరీని సైతం ఈ సినిమాలో చూపించనున్నామని అన్నారు. 2018లో గుజరాత్ వెరావల్ నుండి వేటకు వెళ్లి పాక్ కోస్ట్ గార్డ్‌కు చిక్కిన 21 మంది మత్స్యకారుల్లో ఒకరైన రామారావు జీవిత నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. శ్రీకాకుళం మత్స్యకారులు గుజరాత్ దాకా పనికోసం వలస వెళ్లడం ఫిషింగ్ చేస్తూ పాక్‌కు చిక్కడం, అక్కడి నుంచి భారత్‌కు రావడం వంటి అంశాలను సినిమాటిక్ గా గుండెలకు హత్తుకునేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
