ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అంటే సముద్రంలోకి ఈత రాకుండా దూకడంతో సమానం. ఇక్కడ ఫేమ్ వచ్చేంత వరకు ఈదుతూనే ఉండాలి. హిట్ కొడితే ఒడ్డుకు చేరుకున్నట్లు. హిట్ లేదు అంటే ఈదుతూనే ఉండాలి. అలాంటి హీరోలలో నాగ చైతన్య ఒకరు. ఏంట్రీ ఇచ్చిన కానుండి మంచి మంచి కధలతో అలరిస్తున్నాప్పటికి అనుకునంతా హిట్ మాత్రం అందులకోలేక పోయ్యాడు. ఇక ఇప్పుడు చై దశ తిరిగింది. తాజాగా ‘తండేల్’ మూవీతో తనేంటో నిరూపించుకున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
Also Read:Siddharth: నాకు అరుదైన వ్యాధి ఉంది అంటూ షాక్ ఇచ్చిన సిద్ధార్థ్..
అయితే ఒక మూవీ ఎన్ని కోట్లు పెట్టి తీసినప్పటికీ దాని ప్రమోట్ చేయకుంటే జనాలు చూడారు. ప్రమెషన్ లేకుండా, సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేస్తే చూసే రోజులు పోయాయి, ప్రేక్షకులను థియేటర్ వరకు లాక్కొని రావాలి అంటే.. కష్టపడి అన్ని రకాల ప్రమోషన్స్ చేయాలి. ఇందులో భాగంగా తాజాగా ‘తండేల్ ’ మూవీ ప్రమోషన్ కోసం, సాయి పల్లవి సోషల్ మీడియాలో ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు నాగచైతన్య సమాధానం చెప్పారు. అయితే ఓ నెటిజన్ ‘‘మీరు యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటారు’’ అంటూ నాగచైతన్య యాక్టింగ్ స్కిల్స్ పై కాస్త హేళన చేస్తూ అడిగాడు. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ ‘‘యాక్టింగ్ నేర్చుకోవడం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. నిరంతరం నేర్చుకుంటున్నే ఉండాలి. ఈ ప్రాసెస్ కి ఫుల్ స్టాప్ ఉండదు. ఒకవేళ ఫుల్ స్టాప్ పెడితే గనుక నటుడుగా ఎదగడానికి పులి స్టాప్ పెట్టినట్లే, ఫ్యూచర్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. అ మాటకొస్తే నేను ఇంకా యాక్టింగ్ నేర్చుకోలేదు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అంటూ తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు.