NTV Telugu Site icon

Naga Chaitanya: ఆమెకు వినే ఓపిక లేదు.. అందుకే ఆమె లైఫ్ లో ఎవరు ఉండరు

Dutha

Dutha

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఒకపక్క తండేల్ సినిమా షూటింగ్ చేస్తూనే.. ఇంకోపక్క దూత ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. దూత సిరీస్ తో చై.. డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సిరీస్ కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 1 నుంచి ఈ సిరీస్.. అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చై.. అన్ని తానే అయ్యి చేస్తున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో కూడా చై ప్రమోషన్స్ వేగవంతం చేస్తున్నాడు. తాజాగా.. సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక NM తో కలిసి చై ఒక వీడియో చేశాడు. నిహారిక గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంటెంట్ క్రియేటర్ గా, ఇన్ఫ్లుయెన్సెర్ గా ఆమె ఎన్నో అవార్డులను అందుకుంది. ఇక మన తెలుగు హీరోలు.. శేష్, మహేష్ బాబుతో సహా.. ఆమెతో కలిసి వీడియోస్ చేశారు. ఇప్పుడు చై.. నిహారిక తో కలిసి వీడియో చేశాడు.

Rani Mukerji : ఆ సినిమా చూసి చాలా మంది విడాకులు తీసుకున్నారు..

దూత సినిమా గురించి చై మాట్లాడుతూ ఉంటుంటే .. నిహారిక ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. కొద్దిసేపు సైలెంట్ గా ఉండమని, దూత సినిమాలో తాను ఒక జర్నలిస్ట్ గా చేస్తున్నానని, తన పేరు సాగర్ అని చెప్తుండగా.. ఇంకోసారి సాగర్ ఎవరు.. ? దూత అంటే ఏంటి అంటూ విసిగిస్తూ ఉంటుంది. ఇక దీంతో విసిగిపోయిన చై.. నీకు వినే ఓపిక లేదు.. అందుకే నీ లైఫ్ లో ఎవరు లేరు అని అనగానే నిహారిక చిన్నబుచ్చుకుంటుంది. వెంటనే చై.. ఆమెకు సారీ చెప్పి .. మళ్లీ సిరీస్ గురించి చెప్తుంటాడు. ఇక చివరగా దూత 2 లో నిహారికకు క్యారెక్టర్ కూడా ఆఫర్ చేస్తాడు. అయినా కూడా నిహారిక డిస్ట్రబ్ చేయడంతో చై అక్కడనుంచి కోపం గా వెళ్ళిపోతాడు. ఇక నిహారిక చివరిలో దూత 2 లో నేను ఉంటాను.. దూత.. డిసెంబర్ 1 న వస్తుంది చూడండి అంటూ వీడియోను ఎండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సిరీస్ తో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments