Site icon NTV Telugu

Naga Chaitanya: స్టార్ హీరోయిన్ తో చైతన్య డేటింగ్.. ఒకే ఇంట్లో ఉంటూ

Naga Chitanya

Naga Chitanya

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. హీరోయిన్ సమంత తో విడాకులు తీసుకున్నాకా చై కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం చై చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇకపోతే చైతన్య రెండో పెళ్లి విషయమై గత కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. నాగార్జున కొడుకుల భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాడని, చై కు రెండో పెళ్లి చేసి ఒక ఇంటివాడిగా మార్చాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని ప్రస్తుతం చైతన్య కెరీర్ గురించే ఆలోచిస్తున్నట్లు అక్కినేని సన్నిహితులు చెప్పడంతో ఆ వార్తలకు తెర పడింది.

కాగా, మరోసారి చైతన్య పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం నాగ చైతన్య, అచ్చ తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇటీవలే మేజర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దగుమ్మ ప్రస్తుతం చైతన్యతోనే కలిసి ఉంటుందని సమాచారం. సమంత తో విడిపోయాకా చై, హోటల్ లో ఉంటున్న విషయం విదితమే.. జూబ్లీ హిల్స్ లో ఒక కొత్త భవనాన్ని కొనుగోలు చేసిన చైతన్య గత కొద్దిరోజులుగా తనకు ఇష్టమైన విధంగా ఇంటిని మార్చుకుంటున్నాడు. అంతవరకు హోటల్ లోనే ఉంటున్న చై ఇటీవల కొత్త ఇంటికి మకాం మార్చాడు. అయితే గత కొన్నిరోజుల నుంచి శోభితా ఆ ఇంట్లోనే చైతూ తో కలిసి ఉంటుందని అంటున్నారు.

ఒకే కారులో వారిద్దరూ వెళ్లడం కూడా పలువురి కంట పడినట్లు సమాచారం. ఇటీవల మేజర్ ప్రమోషన్స్ లో పాల్గొన్న శోభితా దగ్గరకు చై కూడా వెళ్లినట్లు పలు ఇంగ్లిష్ పత్రికలు ప్రచురించడం విశేషం. ఇక వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక మరికొంతమంది మాత్రం చైతూను సపోర్ట్ చేస్తూ వారిద్దరూ స్నేహితులు గా ఉంటున్నారేమో.. నిజానిజాలు తెలియకుండా మాట్లాడకూడదు అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే అక్కినేని హీరో నోరు విప్పాల్సిందే.

Exit mobile version