అక్కినేని నటవారసుడిగా జోష్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. హిట్లకు పొంగిపోకుండా.. ప్లాపులకు కుంగిపోకుండా దైర్యంగా ముందడుగేసి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ప్రేమించిన సమంతను దైర్యంగా పెళ్లాడడం.. విభేదాలు వచ్చినప్పుడు అంతే ధైర్యంగా విడిపోతున్నామని చెప్పి పక్కా జెంటిల్ మ్యాన్ అనిపించుకుంటున్నాడు. ఇక విడాకుల తరువాత చైతూకు కలిసొచ్చిందా..? అంటే అవుననే అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. విడాకుల ముందు చైతూ ఇంకా ఒడిదుడుకుల మధ్యనే కొట్టుకుంటూ ఉండేవాడు.
సామ్ తో విడిడిపోయాక లవ్ స్టోరీ, బంగార్రాజు వరుస హిట్లు.. బాలీవుడ్ ఎంట్రీ.. ఓటిటీ లోకి ప్రవేశం.. మరో రెండు మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇలా ఒకదాని తరువాత ఒకటి చైతూకు వరుస అవకాశాలు ఒకేసారి వచ్చి చేరాయి. ఇవన్నీ పక్కన పెడితే మరో క్రేజీ కాంబోలో ఈ అక్కినేని హీరో చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ చిత్రంతో విజయాన్ని అందుకున్న రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలో చై నటించనున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారట. ఇక దీంతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా చైతూ నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విడాకుల తరువాత ఈ సోగ్గాడికీ బాగా కలిసొచ్చిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
