Site icon NTV Telugu

Naga Babu: అప్పుడు పవన్‌ని నడిపించాను.. ఇప్పుడు అడుగుజాడల్లో నడుస్తున్నాను

Nagababu On Pk

Nagababu On Pk

Naga Babu Emotional Tweet On Pawan Kalyan And Varun Tej Engagement: పవన్ కళ్యాణ్, నాగబాబు మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను ‘ఆరెంజ్’ సినిమాతో డబ్బులు కోల్పోయినప్పుడు, పవనే తనలో స్ఫూర్తి నింపాడని చెప్పారు. ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయన్న ఆయన.. రాజకీయంగా పవన్‌కి వెన్నంటే ఉంటూ, తన మద్దతు ఇస్తున్నారు. పవన్ వేస్తున్న అడుగుజాడల్లో తాను నడుస్తూ.. పార్టీపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ అతనికి అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ట్విటర్ మాధ్యమంగా పవన్‌పై ఆయన చేసిన ట్వీట్ చూస్తే.. వారి మధ్య ఉన్న బంధం ఎంత బలమైందో, పవన్‌కి ఆయనిచ్చే గౌరవం ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Adipurush: ‘ఆదిపురుష్’ ఫలితాలపై వేణు స్వామి చెప్పిందే నిజమవుతుందా?

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు పవన్ వస్తున్న సమయంలో.. నాగబాబు స్వయంగా స్వాగతించారు. అతని వెనకాలే నడుచుకుంటూ వచ్చారు. ఈ దృశ్యానికి సంబంధించిన ఫోటోను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘‘అతడు పిల్లాడిగా ఉన్నప్పుడు, ప్రాపర్‌గా ఎలా నడవాలో నేర్పించాను. ఇప్పుడు మేమిద్దరం పెద్దవాళ్లమయ్యాం. పవన్ కళ్యాణ్ ఉన్నత స్థానాలకి ఎదిగాడు. సరైన మార్గంలో నడిచే అవగాహన సంపాదించాడు. అందుకే, నేను అతని అడుగుజాడల్లో నడుస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ఆయన వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థంపై కూడా ఓ భావోద్వేగమైన ట్వీట్ చేశారు. ఇది తమ జీవితంలో ఓ చిరస్మరణీయమైన ఘట్టమంటూ చెప్పుకొచ్చారు.

Siddharth: ఆదితి రావుతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చేసిన సిద్ధార్థ్

‘‘నా తనయుడి నిశ్చితార్థం కావడం, అందమైన వధువు మా ఇంటికి స్వాగతిస్తున్నందుకు.. నేను ఆనందంలో మునిగితేలుతున్నా. ఇది మా గతానికి, వర్తమానానికి వారధి వేసే క్షణం. ఈ జంట తమ ప్రయాణాన్ని అద్భుతంగా కొనసాగించాలని మనసారా దీవిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేస్తూ.. తన ఫ్యామిలీ ఫోటోను నాగబాబు జత చేశారు.

Exit mobile version