NTV Telugu Site icon

Project K : ఆనంద్ మహీంద్రాకు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్

Nag-Ashwin

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. మరోవైపు తన నెక్స్ట్ మూవీ “ప్రాజెక్ట్ కే” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో, దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రఖ్యాత బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ పర్వేజ్ షేక్ “ప్రాజెక్ట్ కే”లో భాగమయ్యారు. అయితే తాజాగా చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ మహీంద్రా గ్రూప్ చైర్ పర్సన్ ఆనంద్ మహీంద్రాను సినిమా కోసం కార్ బిల్డ్ చేసి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు.

Read Also : RGV : హే పవన్ కాబోయే పీఎం చెప్తున్నాడు విను… సీన్ లోకి కేఏ పాల్

“ప్రియమైన ఆనంద్‌ మహీంద్ర సర్… మేము Mr.బచన్, ప్రభాస్, దీపికలతో కలిసి #ProjectK అనే భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ఈ ప్రపంచం కోసం మనం నిర్మిస్తున్న కొన్ని వాహనాలు నేటి సాంకేతికతకు మించిన ప్రత్యేకత కలిగి వున్నాయి. ఈ చిత్రం అద్భుతంగా ఉంటే మన దేశానికి గర్వకారణం అని భావించాలి. నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను సార్… విలో టాలెంటెడ్, పూర్తిగా ఇండియన్ టీమ్ ఇంజనీర్లు, డిజైనర్లు ఉన్నారు. కానీ ప్రాజెక్ట్ స్కేల్ మన చేతికి అందేలా ఉంది. ఇలాంటి సినిమా ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించలేదు. భవిష్యత్తును రూపొందించడంలో మీరు మాకు సహాయం చేయగలిగితే గౌరవంగా ఉంటుంది… #ProjectK” అంటూ సినిమాలో భాగం కావాలని ఆనంద్ మహీంద్రాను కోరారు నాగ్ అశ్విన్.