NTV Telugu Site icon

Virupaksha: మెగా హీరోకే కాదు అమ్మడు.. మాక్కూడా తెగ నచ్చేశావ్

Virupaksha

Virupaksha

Virupaksha: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ బైక్ ఆక్సిడెంట్ తరువాత వస్తున్న మొదటి చిత్రం విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో తేజ్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నచ్చావులే.. నచ్చావులే అంటూ సాగిన ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కృష్ణకాంత్ ఈ సాంగ్ కు లిరిక్స్ అందించగా.. అంజనీష్ లోక్ నాథ్ సంగీతం ఎంతో ఫ్రెష్ గా ఉంది. ఇక కార్తీక్ వాయిస్ లో ఏదో మాయ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Kantara 2: రూ. 5 కోట్లు ఎక్కడ.. రూ. 100 కోట్లు ఎక్కడ.. ఏమన్నా డిమాండా బాబు..?

పల్లెటూరి అమ్మాయిగా సంయుక్త ఎంతో అందంగా కనిపించింది. ఆమెను మొదటిసారి చూడగానే వచ్చిన ఫీలింగ్, ఆమె బిహేవియర్, క్యారెక్టర్ ను ఎంతో అందంగా హీరో వర్ణిస్తూ ఉంటాడు. కోపం ఉంటుంది అలాగే అణుకువగా ఉంటుంది. ప్రేమ ఉంటుంది.. కానీ పైకి చూపించదు అని హీరో తన మనసులోని భావాలను చెప్తున్న తీరు ఆకట్టుకొంటుంది. ఇక సాంగ్ కు ఏదైనా హైలైట్ ఉంది అని చెప్పాలి అంటే సంయుక్త అందమే. అచ్చ తెలుగు ఆడపిల్లలా.. లంగావోణిలు, చీరలతో మైమరిపించేసింది. సంయుక్త తన మొదటిసినిమా నుంచి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే వస్తుంది. భీమ్లా నాయక్, బింబిసార, సార్.. ఇక ఇప్పుడు విరూపాక్ష. ఇక ఈ లక్కీ ఛార్మ్ మెగా హీరోకే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చేసింది. మరి ఈ సినిమాతో ఈ అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.