Site icon NTV Telugu

Nabha Natesh : వాళ్లను క్షమించకూడదు.. పహల్గాం దాడిపై నభానటేష్..

Nabha Natesh

Nabha Natesh

Nabha Natesh : పహల్గాంలో ఉగ్రవాదుల దాడిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది దీనిపై సీరియస్ గా స్పందిస్తున్నారు. అటు సినీ సెలబ్రిటీలు కూడా వరుసగా మాట్లాడుతున్నారు. తాజాగా గ్లామర్ బ్యూటీ నభానటేష్ కూడా దీనిపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తనను తీవ్రంగా కలిచి వేసిందని చెప్పింది. తాను ఏడాది క్రితం పహల్గాంలో షూటింగ్ చేసినట్టు తెలిపింది. ఆ అందమైన ప్రదేశంలో ఎన్నో సార్లు షూటింగ్స్ కు వెళ్లినట్టు చెప్పింది. భూతల స్వర్గం అయిన కశ్మీర్ లోని పహల్గాంలో ఇలాంటి దాడులు అస్సలు ఉపేక్షించేది లేదని.. ఆ దుర్మార్గులను అస్సలు క్షమించకూడదని చెప్పుకొచ్చింది.
Read Also : PM Modi: మోడీ సంచలన నిర్ణయం.. రంగంలోకి త్రివిధ దళాలు..

‘నాకు కశ్మీర్ తో పాటు పహల్గాంలో ఎన్నో అందమైన అనుభూతులు ఉన్నాయి. అక్కడకు నిత్యం టూరిస్టులు వెళ్తుంటారు. నేను కూడా ఎన్నోసార్లు వెళ్లాను. అలాంటి అందమైన ప్రదేశంలో ఇలాంటి హింసను అస్సలు ఊహించలేదు. ఇలాంటి దాడులను అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. ఇలాంటి దాడులు జరిపితే టూరిస్టులు అక్కడకు వెళ్లేందుకు కూడా భయపడుతారు. కాబట్టి ఇలాంటి వాటిని మనం తీవ్రంగా ఖండించాలి. అందమైన ప్రదేశంలో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అంటూ కోరింది.
Read Also : Chiranjeevi : ఎన్టీఆర్-నీల్ మూవీ వాయిదా.. చిరంజీవికి తిరుగేలేదు..

Exit mobile version