అల్లరి నరేష్ ఒకప్పుడు తెరపై బాగా అల్లరి చేస్తూ చాలా సినిమాల్లో నటించాడు కానీ ఆయన చేసిన అన్ని సినిమాల్లో కన్నా ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అయిన మూవీ ‘గమ్యం’. ఈ సినిమాలో అల్లరి నరేష్ ‘గాలిశీను’ అనే పాత్రలో కనిపించాడు. ఈ క్యారెక్టర్ లో ఎంత ఫన్ ఉంటుందో అంతే ఎమోషన్ కూడా ఉంటుంది. క్లైమాక్స్ లో గాలిశీను చనిపోతే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. అంత ఆర్క్ నున్న క్యారెక్టర్ అల్లరి నరేష్ ఫిల్మోగ్రఫీలో మరొకటి లేదు. ఈ మధ్య రీఎంట్రీ తర్వాత అల్లరి నరేష్ పూర్తిగా కామెడీ ట్రాక్ వదిలేసి యాక్షన్ వైపు వచ్చేసాడు. థ్రిల్లర్, యాక్షన్ జానర్ లో సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్న అల్లరి నరేష్ లోని కామెడీ టైమింగ్ ని డైరెక్టర్స్ కంప్లీట్ గా పక్కన పెట్టేసారు. అల్లరి నరేష్ కూడా సీరియస్ సినిమాలు చెయ్యడానికే ఇష్టపడుతున్నాడు. ఇలాంటి సమయంలో అందరూ మిస్ అవుతున్న పాత అల్లరి నరేష్ ని మళ్లీ పరిచయం చేయడానికి నా సామిరంగ సినిమా వస్తోంది.
కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నారు. అంజిగాడు అనే పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్ కి సంబందించిన ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేసారు. మాటోచ్చేత్తాది అంటూ అల్లరి నరేష్ ఈ 55 సెకండ్ల ప్రోమోలో చేసిన అల్లరి అంతాఇంతా కాదు. ఈమధ్య కాలంలో మిస్ అయిన అల్లరి నరేష్ ని ఒక్క ప్రోమోతో మళ్లీ గుర్తు చేసింది నా సామిరంగ సినిమా. సింపుల్ గా చెప్పాలి అంటే అప్పుడు గాలిశీను, ఇప్పుడు అంజిగాడు అనేలా ఉంది నా సామిరంగ ప్రోమో. నాగార్జున-అల్లరి నరేష్ ల కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మరి సంక్రాంతికి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
అంజిగాడు వచ్చేహెడు సూసారా…
సూసెయ్యండి…సూసెయ్యండి …
లేదంటే మాటోచ్చేత్తాది…▶️ https://t.co/HBYQGbMyDB#NaaSaamiRanga #NSRForSankranthi
KING 👑 @iamnagarjuna @mmkeeravaani @AshikaRanganath @RuksharDhillon @vijaybinni4u @KumarBezwada @srinivasaaoffl @SS_Screens… pic.twitter.com/IoUtwDeLqQ
— Allari Naresh (@allarinaresh) December 15, 2023