Naa Ready First Single: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేడు తన 49 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం విజయ్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష నటిస్తుండగా.. సంజయ్ దత్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇక నేడు విజయ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ .. తాజాగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. నా రెడీ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. విజయ్- లోకేష్- అనిరుధ్ కలయిక లో వచ్చిన మాస్టర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Spy Trailer: స్వాతంత్య్రం అంటే ఒకడు ఇచ్చేది కాదు లాక్కొనేది
ఇక ఇప్పుడు అదే కాంబో రీపీట్ అవ్వడమే కాదు అదే మ్యాజిక్ ను మరోసారి రీపీట్ చేశాడు అనిరుధ్. సాంగ్ మొత్తం గూస్ బంప్స్ తెప్పించేలా హుషారుగా, జోరుగా ఉంది. ఇక మాస్ స్టెప్స్ తో విజయ్ అదరగొట్టేశాడు. వీడియోలో 100 కు పైగా డ్యాన్సర్లు పాల్గొన్నట్లు కనిపిస్తుంది. సెట్ లో సంజయ్ దత్, లోకేష్, అనిరుధ్ తదితరులు కనిపించరు. ముఖ్యంగా విజయ్ మాస్ స్టెప్పులకు అయితే .. అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని చెప్పొచ్చు. ఈ సాంగ్ విజయ్ చార్ట్ బస్టర్ సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తుంది . ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఈ కాంబో మరో హిట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.