Site icon NTV Telugu

Waltair Verayya: మెగా ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్…

Chiru

Chiru

మెగాస్టార్ చిరంజీవిని చూసినా, ఆయన నటించిన ఐకానిక్ సినిమాలు చూసినా ఒక పర్ఫెక్ట్ మాస్ హీరో ఎలా ఉండాలో ఈజీగా తెలిసిపోతుంది. మూడు దశాబ్దాల పాటు మాస్ అనే పదానికే మూల విరాట్ గా నిలిచిన చిరంజీవి గత కొన్ని రోజులుగా సీరియస్ సినిమాలే చేస్తున్నాడు. మాస్ ని మిస్ అయిన ఫాన్స్ చిరుని ఒక్క మాస్ సినిమా చెయ్యి బాసు అంటూ రిక్వెస్ట్ చేశారు. ఫాన్స్ అంతలా మిస్ అయిన మాస్ మూల విరాట్ గెటప్ లోకి వస్తూ చిరు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి బయటకి వచ్చిన ‘బాస్ పార్టీ’ సాంగ్ మెగా అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టింది. లుంగీ కట్టీ చిరు చిందేస్తే ఎలా ఉంటుందో ‘బాస్ పార్టీ’ లిరికల్ సాంగ్ సాంపిల్ చూపించింది. ‘బాస్ పార్టీ’ సాంగ్ 20 మిలియన్ వ్యూస్ రాబట్టి చార్ట్ బస్టర్ అయ్యింది. ఈ సాంగ్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ జోష్ లో చిత్ర యూనిట్ ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడానికి రెడీ అయ్యారు.

డిసెంబర్ 7న సాయంత్రం 4:05 నిమిషాలకి ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయబోతున్నామని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. బాస్ పార్టీ అయిపొయింది, ఇక థియేటర్స్ లో మాస్ పార్టీ చేద్దాం అంటూ మైత్రి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సంక్రాంతి బరిలో ‘వాల్తేరు వీరయ్య’ నిలబడుతుందనే విషయాన్ని చెప్పి చాలా కాలమే అయ్యింది కానీ చిరు ఏ డేట్ కి వస్తాడు అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఈ డైలమాలో ఎండ్ కార్డ్ వేస్తూ రిలీజ్ డేట్ ని ప్రకటించబోతున్నారు. సంక్రాంతి బరిలోనే ఉన్న మరో సీనియర్ స్టార్ హీరో బాలక్రిష తన ‘వీర సింహా రెడ్డి’ సినిమాని జనవరి 12న విడుదల చేస్తున్నాడు. మరి చిరు, బాలయ్య కన్నా ముందు వస్తాడా? లేక బాలయ్య తర్వాత వస్తాడా? అనేది చూడాలి.

Exit mobile version