Site icon NTV Telugu

Mythri Movie Makers: రవితేజ-గోపీచంద్ కాంబోలో మైత్రీ మరో సినిమా.. 9న అధికారిక ప్రకటన

Ravi Teja Gopichand Malineni Movie

Ravi Teja Gopichand Malineni Movie

Mythri Movie Makers movie with raviteja- Gopichand: సాధారణంగా కొన్ని కాంబినేషన్ల సినిమాలు బాగా వర్కౌట్ అవ్వడమే కాదు అవే మరోసారి రిపీట్ అవుతున్నాయి అంటే ఆ క్రేజ్‌ మామూలుగా ఉండదు. సినిమా ఎలా ఉండబోతుంది అనే లెక్క మొదలు పెడితే బాక్సాఫీస్‌ రికార్డులు ఎంతవరకు వస్తాయి? ఈసారి నటీనటులను మారుస్తారా? కొత్త వాళ్లు ఎంట్రీ ఇస్తారా? అని ఇన్ని రకాలుగా అయితే లెక్కలేసుకుంటూ ఉంటారు. ఇక అలా మంచి క్రేజీ కాంబోల్లో ఒకటి రవితేజ-గోపీచంద్‌ మలినేనిది. ఎందుకంటే ఈ ఇద్దరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రచ్చ రేపాయి. డాన్‌ శీను, బలుపు మంచి సక్సెస్‌ను అందుకోగా చాలా కాలంగా సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న మాస్‌ మహారాజాకు క్రాక్ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ కూడా అందించాడు గోపీచంద్ మలినేని.

Falaknuma Express Train: వారంలో ప్రమాదం అని హెచ్చరిక లేఖ.. అదే నిజమైందా?

రవితేజ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన క్రాక్‌ మాస్‌ మహారాజా మార్కెట్‌ అమాంతం పెంచేయడమే కాదు ఆయనకు వరుస సినిమా అవకాశాలు కూడా వచ్చేలా చేసింది. ఇక క్రాక్‌ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ మీదున్న రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో నాలుగో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్త తెలుగు సినీ లవర్స్‌లో జోష్‌ నింపుతోంది. రవితేజ కోసం గోపీచంద్‌ మలినేని పవర్‌ ఫుల్ స్కిప్ట్‌ సిద్దం చేసి వినిపించగా కథ విన్న మాస్ మహారాజా సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుండగా ఈ మేరకు జూలై 9న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version