NTV Telugu Site icon

Mythri Movie Makers: ఆహా… ఎన్న బ్యాలెన్సింగ్ తలైవా

Nbk Chiru

Nbk Chiru

ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యడమే కష్టం, అది కూడా ఒకేసారి షూటింగ్ చెయ్యడం ఇంకా కష్టం. ఈ రెండింటికన్నా అత్యంత కష్టమైన విషయం, చేసిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలని ఒకేసారి కేవలం ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ చెయ్యడం. అది కూడా గత మూడు దశాబ్దాలుగా ప్రొఫెషనల్ రైవల్రీ ఉన్న మెగా నందమూరి టాప్ హీరోల సినిమాలని బాలన్స్ చేస్తూ ప్రమోషన్స్ చెయ్యడం అన్నింటికన్నా కష్టమైన పని… ఈ కష్టాన్నే చాలా ఈజీగా ఫేస్ చేసి సక్సస్ అవుతోంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తోంది కానీ సీనియర్ హీరోలైన చిరు, బాలయ్యలతో సినిమాలు చెయ్యడం ఇదే మొదటిసారి. చిరుని ‘వాల్తేరు వీరయ్య’గా చూపించనున్న మైత్రీ మూవీ మేకర్స్, బాలయ్యని ‘వీర సింహా రెడ్డి’గా ప్రెజెంట్ చెయ్యబోతున్నారు. సంక్రాంతి సీజన్ లో హీట్ పెంచుతూ ఈ రెండు సినిమాలు వన్ డే గ్యాప్ లో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాయి. వీర సింహా రెడ్డి జనవరి 12న, వాల్తేరు వీరయ్య 13న ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవనున్నాయి అంటే రెండు సినిమాల ప్రమోషన్స్ కూడా ఒకేసారి జరగాలి. ఇక్కడే మైత్రీ మూవీ మేకర్స్ సూపర్ సక్సస్ అయ్యారు.

వీర సింహా రెడ్డి నుంచి ఒక అప్డేట్ రాగానే వాల్తేరు వీరయ్య నుంచి ఒక అప్డేట్ ఇవ్వడం, చిరు సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయితే బాలయ్య సినిమా నుంచి కూడా సాంగ్ రిలీజ్ చెయ్యడం, మెగాస్టార్ పోస్టర్ బయటకి వస్తే నటసింహం పోస్టర్ ని కూడా బయటకి వదలడం… ఇలా ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. అయినా కూడా కొందరు మెగా అభిమానులు వాల్తేరు వీరయ్య సినిమాకి అన్యాయం చేస్తున్నారు అంటూ మైత్రీ మూవీ మేకర్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఒక స్టార్ హీరోతో సినిమా చేసే ఏ ప్రొడ్యూసర్ కూడా తన సినిమాని తక్కువ చేసి చూడడు, తన సినిమాకి తనే అన్యాయం చేసుకోడు అనే విషయాన్ని మర్చిపోయి కొందరు విమర్శలు చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ కి రెండు సినిమాలు చాలా ముఖ్యమనే క్లారిటీ ఇచ్చే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేస్తూ…    రీసెంట్ గా వీర సింహా రెడ్డి సినిమా నుంచి ‘మా బావ మనోభావాలు’ సాంగ్ ని ‘సంధ్యా 35MM’ థియేటర్ లో ఈవెంట్ చేసి మరీ లాంచ్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్, ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా నుంచి డిసెంబర్ 30న రానున్న ‘పూనకలు లోడింగ్’ సాంగ్ ని కూడా గ్రాండ్ ఈవెంట్ చేసి లాంచ్ చెయ్యనున్నారు. సంధ్యా 70MM థియేటర్ లో ‘పూనకాలు లోడింగ్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ తో పాటు నెల్లూరు, అనంతపూర్, రాజమండ్రి, గుంటూర్, విజయవాడలోని ప్రముఖ థియేటర్స్ లో ‘పూనకలు లోడింగ్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల ప్రమోషన్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ పర్ఫెక్ట్ గా బాలన్స్ చేస్తూ… రెండు సినిమాలని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్తున్నారు. ఇదే జోష్ లో వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల ట్రైలర్ కూడా బయటకి వస్తే రెండు సినిమాల ప్రమోషన్స్ లో మరింత జోష్ మొదలైనట్లే.

Show comments