Mythri Movie Makers: ఆహా… ఎన్న బ్యాలెన్సింగ్ తలైవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యడమే కష్టం, అది కూడా ఒకేసారి షూటింగ్ చెయ్యడం ఇంకా కష్టం. ఈ రెండింటికన్నా అత్యంత కష్టమైన విషయం, చేసిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలని ఒకేసారి కేవలం ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ చెయ్యడం. అది కూడా గత మూడు దశాబ్దాలుగా ప్రొఫెషనల్ రైవల్రీ ఉన్న మెగా నందమూరి టాప్ హీరోల సినిమాలని బాలన్స్ చేస్తూ ప్రమోషన్స్ చెయ్యడం అన్నింటికన్నా కష్టమైన పని… ఈ కష్టాన్నే చాలా ఈజీగా ఫేస్ చేసి సక్సస్ అవుతోంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తోంది కానీ సీనియర్ హీరోలైన చిరు, బాలయ్యలతో సినిమాలు చెయ్యడం ఇదే మొదటిసారి. చిరుని ‘వాల్తేరు వీరయ్య’గా చూపించనున్న మైత్రీ మూవీ మేకర్స్, బాలయ్యని ‘వీర సింహా రెడ్డి’గా ప్రెజెంట్ చెయ్యబోతున్నారు. సంక్రాంతి సీజన్ లో హీట్ పెంచుతూ ఈ రెండు సినిమాలు వన్ డే గ్యాప్ లో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాయి. వీర సింహా రెడ్డి జనవరి 12న, వాల్తేరు వీరయ్య 13న ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవనున్నాయి అంటే రెండు సినిమాల ప్రమోషన్స్ కూడా ఒకేసారి జరగాలి. ఇక్కడే మైత్రీ మూవీ మేకర్స్ సూపర్ సక్సస్ అయ్యారు.
వీర సింహా రెడ్డి నుంచి ఒక అప్డేట్ రాగానే వాల్తేరు వీరయ్య నుంచి ఒక అప్డేట్ ఇవ్వడం, చిరు సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయితే బాలయ్య సినిమా నుంచి కూడా సాంగ్ రిలీజ్ చెయ్యడం, మెగాస్టార్ పోస్టర్ బయటకి వస్తే నటసింహం పోస్టర్ ని కూడా బయటకి వదలడం… ఇలా ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. అయినా కూడా కొందరు మెగా అభిమానులు వాల్తేరు వీరయ్య సినిమాకి అన్యాయం చేస్తున్నారు అంటూ మైత్రీ మూవీ మేకర్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఒక స్టార్ హీరోతో సినిమా చేసే ఏ ప్రొడ్యూసర్ కూడా తన సినిమాని తక్కువ చేసి చూడడు, తన సినిమాకి తనే అన్యాయం చేసుకోడు అనే విషయాన్ని మర్చిపోయి కొందరు విమర్శలు చేస్తున్నారు.
Also Read
మైత్రీ మూవీ మేకర్స్ కి రెండు సినిమాలు చాలా ముఖ్యమనే క్లారిటీ ఇచ్చే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేస్తూ… రీసెంట్ గా వీర సింహా రెడ్డి సినిమా నుంచి ‘మా బావ మనోభావాలు’ సాంగ్ ని ‘సంధ్యా 35MM’ థియేటర్ లో ఈవెంట్ చేసి మరీ లాంచ్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్, ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా నుంచి డిసెంబర్ 30న రానున్న ‘పూనకలు లోడింగ్’ సాంగ్ ని కూడా గ్రాండ్ ఈవెంట్ చేసి లాంచ్ చెయ్యనున్నారు. సంధ్యా 70MM థియేటర్ లో ‘పూనకాలు లోడింగ్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ తో పాటు నెల్లూరు, అనంతపూర్, రాజమండ్రి, గుంటూర్, విజయవాడలోని ప్రముఖ థియేటర్స్ లో ‘పూనకలు లోడింగ్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల ప్రమోషన్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ పర్ఫెక్ట్ గా బాలన్స్ చేస్తూ… రెండు సినిమాలని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్తున్నారు. ఇదే జోష్ లో వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల ట్రైలర్ కూడా బయటకి వస్తే రెండు సినిమాల ప్రమోషన్స్ లో మరింత జోష్ మొదలైనట్లే.
A MEGA MASSIVE LAUNCH for the MEGA MASS song 🔥💥#PoonakaaluLoading from #WaltairVeerayya will be launched in the theatres from 5PM onwards tomorrow amidst huge fan fare 🔥
Mega⭐ @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/jG3wegj5LD
— Mythri Movie Makers (@MythriOfficial) December 29, 2022
తాజావార్తలు
-
Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
-
Ravi Kishan: ‘‘జెన్-జీ భారతదేశ ఆత్మ’’.. CJPకి యువతతో సంబంధం లేదు..
-
Harish Rao : జర్మనీ ఉద్యోగాల పేరుతో మోసమా? టామ్కామ్పై హరీష్ రావు ఫైర్
-
Varanasi: ‘వారణాసి’ పోస్ట్‌పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ – జక్కన్న మూవీ!
-
Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!