Site icon NTV Telugu

NTRNeel : ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఊరించి..ఉసూరుమనిపించిన మైత్రీ

Young Tiger

Young Tiger

యంగ్ టైగర్ ఎన్టీఆర్  బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. అదే జోష్ లో రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అందులో ఒకటి బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది.  రెండవది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్. ఈ సినిమాను టాలీవుడ్ బిగెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవి మేకర్స్ నిర్మిస్తోంది. కాగా ఈ నెల 20న తారక్ బర్త్ డే రాబోతుంది.  ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానుల కోసం డ్రాగన్ సినిమా కు సంబందించి గ్లిమ్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

Also Read : Official : మెగాస్టార్ కు జోడిగా లేడి సూపర్ స్టార్..

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను నిరుత్సహపరిచింది మైత్రీ మూవీస్. తారక్ బర్త్ డే కనుకగా ఎన్టీఆర్ నీల్ సినిమా నుండి అప్డేట్ ఇవ్వడం లేదని తెలిపింది. ఆ విషయాన్ని అఫీషియల్ గా తెలుపుతూ ‘ డియర్ ఫ్యాన్స్ మీరు ఎన్టీఆర్ – నీల్ సినిమా గ్లిమ్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు అని తెలుసు. కానీ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ సినిమా వార్ 2 నుండి బర్త్ డే కానుకగా మీరు ఊహించని అప్డేట్ రాబోతుంది. ఆ కారణంగా నీల్ సినిమా అప్డేట్ ను వాయిదా వేస్తున్నాం’ అని అధికారకంగా వెల్లడించింది. దాంతో ఫ్యాన్స్ కాస్త డిజప్పోయింట్ అయ్యారు. ఫ్యాన్స్ ను ఇలా ఉరించి.. ఉసూరుమనిపించడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే వార్ 2 నుండి స్పెషల్ అప్డేట్ వస్తుండడంతో కొంచం ఇష్టంగా.. కొంచం కష్టంగా ఫీలవుతున్నారు నందమూరి ఫ్యాన్స్.

Exit mobile version