NTV Telugu Site icon

మా అల్లుడు వెరీగుడ్.. కెజిఎఫ్ – 2 తర్వాత కల్కి మాత్రమే..

Untitled Design (7)

Untitled Design (7)

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకు వెళ్తూ రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది.

ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది కల్కి. సమీపంలో పెద్ద సినీమాలు లేకపోవడం కల్కి లాంగ్ రన్ కు కలిసి వచ్చే అంశం. ఓవర్ సీస్ లో $20 మిలియన్ల దిశగా దూసుకెళ్తోంది. కల్కి చిత్రానికి రిలీజ్ కు ముందు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కొన్ని ఏరియాలు నిర్మాత ఓన్ రిస్క్ పై విడుదల చేసారు. కాగా నేడు దాదాపు అన్ని ఏరియాలలో కల్కి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక నుండి వచ్చేవన్నీ లాభాలే. ఈ మధ్య కాలంలో ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిన సినిమా కల్కిమాత్రమే. ఏపీలోని వెస్ట్ గోదావరి లాంటి చిన్న సెంటర్ లో కూడా కల్కి రూ. 8 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది. ముఖ్యంగా థియేటర్లకు క్యాంటీన్ ఆదాయం, పార్కింగ్ ఆదాయం బాగా అందింది. ఇలా ఈ ఏడాదిలో ప్రతి ఒక్కరూ లాభాలు చుసిన చిత్రం కల్కి. ఇన్నాళ్లు సినిమా వ్యాపారానికి బ్రేక్ ఇచ్చి స్తబ్దుగా ఉన్న బయ్యర్లు కల్కి ఇచ్చిన భరోసాతో మళ్లీ యాక్టీవ్ అయ్యారు. రాబోయే సినిమాలపై ఓ కన్నేసి ఉంచారు.

మరోవైపు నిర్మాత అశ్వనీదత్ కు ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమా కంటెంట్ పై నమ్మకంతో దత్ ఈ చిత్రాన్నీ అడ్వాన్స్ బేసిస్ పై రిలీజ్ చేసారు. కెజిఎఫ్ 2 తరువాత నిర్మాత ఓన్ రిస్క్ చేసి, ప్రపంచం అంతటా అడ్వాన్స్ ల మీద విడుదల చేసిన సినిమా కల్కి మాత్రమే. అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కితో అశ్వనీదత్ కు లాభాల పంట పండింది.

Also read: Ntr Devara Update: దేవర ముంగిట వారం రోజులు మాత్రమే..