NTV Telugu Site icon

Trisha : కొడుకు మరణంతో.. తీరని దుఃఖంలో త్రిష

Trisha

Trisha

త్రిష కొడుకు చనిపోయాడు. అసలు త్రిషకు పెళ్లెప్పుడు అయింది, కొడుకు ఎప్పుడు పుట్టాడు. అనేదే కదా అనుమనం.  కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది.సెకండ్ ఇన్నింగ్స్‌లో యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతున్న త్రిష.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తమిళ్‌లో అజిత్, సూర్య, కమల్ హాసన్ సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మలయాళంలోనూ రెండు సినిమాలు చేస్తోంది. ఇటు తెలుగులో చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ సరసన ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది.

Also Read : Jani Master Case : జానీ మాస్టర్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు

ఇలా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న త్రిష ఉన్నట్టుండి, క్రిస్మస్ రోజున నా కొడుకు చనిపోయాడు, ప్రస్తుతం తాను షాక్‌లో ఉన్నానని ఒక షాకింగ్ పోస్ట్ చేసింది. ‘క్రిస్మస్‌ రోజు వేకువజామున నా కుమారుడు జోరో మరణించాడు. నా గురించి తెలిసిన వారికి జోరో గురించి తెలుసు జోరో లేకపోతే నా లైఫ్ శూన్యంతో సమానం అని కూడా తెలుసు. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాము. ఈ షాక్‌ నుంచి కోలుకోవడానికి నాకు కొంత సమయం పడుతుంది. సినిమాల నుంచి కాస్త విరామం కూడా తీసుకుంటున్నా. కొన్ని రోజుల వరకూ అందుబాటులో ఉండను’ అంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది. అలాగే జోరో ఫొటోలను షేర్ చేసింది.  ఇక్కడ కొడుకు అంటే త్రిష పెంపుడు కుక్క. గత 12 ఏళ్లుగా జోరో త్రిష వద్దే ఉంటోందట. దాన్ని కన్నబిడ్డలా చూసుకుంటోందట. కానీ దురదృష్టవశాత్తూ జోరో క్రిస్మస్ రోజు ప్రాణాలు కోల్పోయింది. జోరో లేకపోవడంతో బోరున విలపిస్తోంది త్రిష.

Show comments