‘మా’ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కంటెస్టెంట్లు కూడా తన వంతు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇటీవలే తన ప్యానెల్ సభ్యులను ప్రకటించిన హీరో మంచు విష్ణు ప్రెస్ తో తాజాగా తన ఆలోచనలను పంచుకున్నారు. కానీ విష్ణు చేసిన వ్యాఖ్యలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ప్రస్తుత స్థితి గురించి తెలుపుతుంది.
Read Also : హాలీవుడ్ పై కన్నేసిన సితార
“మా ప్రెసిడెంట్ అనేది ట్యాగ్ కాదు, బాధ్యత. నేను దానిని సమర్ధవంతంగా నిర్వహించగలనని నాకు నమ్మకం ఉంది. నా ప్యానెల్‌లో ఎవరూ ఎన్నికల షెడ్యూల్ విధానం గురించి సంతోషంగా లేరు. నా తండ్రి నేను ‘మా’ ఎన్నికలలో పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే ఆయన 46 సంవత్సరాలుగా పరిశ్రమలో ఉన్నాడు. ఇన్నేళ్ళలో పరిశ్రమను విభజించడాన్ని ఎప్పుడూ చూడలేదు” అని విష్ణు పేర్కొన్నారు. ఈ ప్రెస్ మీట్‌లో విష్ణుతో పాటు హాస్యనటులు పృథ్వీరాజ్, బాబు మోహన్, గౌతమ్ రాజు, కరాటే కళ్యాణి, నటుడు శివ బాలాజీ ఉన్నారు.
దివంగత దాసరి నారాయణరావు, మురళీ మోహన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కోసం పోటీ చేయమని విష్ణు అడిగారట. 2015-16 జరిగిన ఎన్నికలను విష్ణు గుర్తు చేసుకున్నారు. “అప్పట్లో నాన్నగారు నన్ను ఆపేశారు. ఎందుకంటే నా చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. పైగా అనుభవం లేదు. ఇప్పుడు నేను ‘మా’లో చాలా మార్పును తీసుకురాగలనని నమ్మకంగా చెప్పగలను” అని విష్ణు అన్నారు. ‘మా అనేది స్వచ్ఛంద సంస్థ కాదు’ అని పిలిచే తన వ్యతిరేక ప్యానెల్ మేము వృద్ధ నటులకు పెన్షన్లు ఇస్తామన్నప్పుడు ఛారిటీ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాలి అని ప్రశ్నించారు.
