Site icon NTV Telugu

Fans War: పవన్- ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ.. పలువురికి గాయాలు

Pawan

Pawan

Fans War: ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ కాస్తా బయటకు వచ్చేస్తున్నాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ట్విట్టర్ లో గొడవలు పడే ఫ్యాన్స్ ఇప్పుడు ఎదురెదురుగా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య జరిగిన ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆగిరిపల్లిలో జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆగిరిపల్లిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ బ్యానర్ ను కట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్యానర్ ను చింపేసి కిందపడేయడంతో ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. చిలికి చిలికి గాలివానలా మాటలతో మొదలైన గొడవ దాడివరకు వెళ్ళింది. 30, 40 మంది యువకులు తమ హీరో బ్యానర్ నే చింపేస్తారా..? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీదకు వెళ్లగా.. వారు కూడా అంతే ఫోర్స్ తో వీరిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఇక ఈ దాడిలో పలువురుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ గొడవకు సంబంధించిన వీడియోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అయితే మరికొంతమంది మ్యూచువల్ ఫ్యాన్స్ ఈ వీడియోస్ వైరల్ అయితే ఇంకా వివాదం ఎక్కువ అవుతుందని ఆలోచించి ఆ వీడియోలను డిలీట్ చేయించారట. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ గొడవల్లో దాదాపు 60, 70 మంది ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెల్సిన నెటిజన్లు పవన్ -ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మొదటి నుంచి గొడవలే అని, అంతకుముందు కూడా చాలాసార్లు కర్రలతో దాడికి కూడా పాల్పడినట్లు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version