Site icon NTV Telugu

Musical War: దసరాకి తమన్ vs అనిరుధ్… ఇక దబిడి దిబిడే!

Muscial War

Muscial War

తమన్, అనిరుధ్ ఇద్దరు ఇద్దరే… కాకపోతే ఒకరు తమిళ తంబీ, ఇంకొకరు తెలుగు బ్రదర్. ప్రస్తుతం కోలీవుడ్‌లో అనిరుధ్ హవా నడుస్తోంది… తెలుగులో తమన్ రచ్చ చేస్తున్నాడు. చివరగా ఈ ఇద్దరు చేసిన సినిమాల దెబ్బకు థియేటర్ బాక్సులు బద్దలైపోయాయి. జైలర్ సినిమా హిట్ అవడానికి మేజర్ రీజన్ అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. రజనీ కాంత్ కూడా ఇదే మాట చెప్పాడంటే… అనిరుధ్ బీజిఎం ఎంత ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక తమన్ మ్యూజిక్ ఇచ్చిన స్కంద సినిమా పై థియేటర్ యాజమాన్యాలు కంప్లైంట్ కూడా చేశాయి. తమన్ దెబ్బకు స్పీకర్లే కాదు.. చెవులకున్న తుప్పు కూడా వదిలేసింది. ఇలాంటి ఈ ఇద్దరు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్స్ దసరాకు నువ్వా నేనా అంటున్నారు. అనిరుధ్ నుంచి లియో… తమన్ నుంచి భగవంత్ కేసరి సినిమాలు బాక్సాఫీస్ వార్‌లో సై అంటున్నాయి.

అక్టోబర్ 19న ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. తమిళ్‌లో విజయ్, తెలుగులో బాలయ్యదే హవా కానీ లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ అవడంతో… లియో పై ఇక్కడ కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రెండు సినిమాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కంపారిజన్ వస్తుంది. దీంతో తమన్, అనిరుధ్‌లో ఎవరిది పై చేయి అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు కూడా బీజిఎంతో కుమ్మేయడం గ్యారెంటీ, ముఖ్యంగా అఖండ నుంచి బాలయ్య సినిమాకు తమన్ ఏం తాగి కొడుతున్నాడో గానీ… బాక్సులు బద్దలవుతున్నాయి. ఇప్పుడు భగవంత్ కేసరితోను అదే జరగబోతోంది. అనిరుధ్ కూడా జైలర్, జవాన్ జోష్‌లో ఉన్నాడు. ఓవరాల్ గా లియో, భగవంత్ కేసరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. మరి ఇద్దరు కలిసి ఫ్యాన్స్‌ను ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.

Exit mobile version