(మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్ వేలంటైన్స్ డే స్పెషల్)
ఫిబ్రవరి 14… ప్రేమికుల రోజు! కరెక్ట్ గా దానికి ముందు వచ్చిన సండే సమ్ థింగ్ స్పెషల్!! ప్రేమికులకు ఒకరోజు ముందే ఆటవిడుపు లాంటిది ఆ ఆదివారం. అందుకే కావచ్చు… ఈ వారం ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ ప్రోగ్రామ్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శ్రీరామచంద్రను గెస్ట్ గా ఆహ్వానించారు. పాడుకుందాం… ఆడుకుందాం అంటూ ఇండియన్ ఐడిల్ -5 విజేత, బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ శ్రీరామ్ తో మోర్ ఫన్ క్రియేట్ చేశాడు సాకేత్. ‘అన్నా… అన్నా…’ అంటూనే శ్రీరామ్ కు సంబంధించిన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఇష్యూస్ అన్నింటినీ వ్యూవర్స్ ముందు పెట్టేశాడు. దాంతో నలభై నిమిషాల ఈ ఎపిసోడ్ ఇలా మొదలై, అలా ముగిసినట్టు అనిపించింది. ‘దీవానా… దీవానా… దిల్ దీవానా…’ అంటూ మొదలైన ఈ ఎపిసోడ్, మాస్ మసాలా మూవీ ‘ఖిలాడీ’ టైటిల్ సాంగ్ తో ఎండ్ అయ్యింది.
వేర్వేరు దేశాల్లో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్!
కీరవాణి దగ్గర కోరస్ తో మొదలైన శ్రీరామచంద్ర కెరీర్ ఇండియన్ ఐడిల్ విజేతగా నిలవడంతో ఒక్కసారి ఊపందుకుంది. తెలుగులో పెద్దంత అవకాశాలు రాకపోయినా… హిందీలో మాత్రం మంచి మంచి పాటలు పాడాడు శ్రీరామ్ చంద్ర. చిత్రం ఏమంటే… ఇండియన్ ఐడిల్ ట్రోఫీ గెలుచుకున్నా శ్రీరామ్ కు తెలుగులో పెద్దగా ఛాన్సెస్ రాలేదు. దానికి కారణాలను సాకేత్ నిర్మొహమాటంగా రివీల్ చేసేశాడు. శ్రీరామ్ పాట పాడటానికి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటాడని, అతని డేట్ సంపాదించడం కష్టమని ఇక్కడి నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్ భావించారని చెప్పాడు. దానికి శ్రీరామ్ వివరణ ఇచ్చాడు. ఇండియన్ ఐడిల్ విజేతగా నిలిచాక రెండేళ్ళ పాటు సోనీ సంస్థకు హైర్ కావడంతో కన్సర్ట్స్ కోసం వరల్డ్ టూర్ వెళ్ళానని, దానితో తెలుగువాళ్ళు అలాంటి అపోహలు కలిగి ఉండొచ్చని చెప్పాడు. ఎల్.ఎం.ఎల్. వెస్పా వేసుకుని తిరిగే వయసులో బ్రేక్ ఫస్ట్ ఒక కంట్రీలో, లంచ్ మరో కంట్రీలో, డిన్నర్ ఇంకో కంట్రీలో చేయాలనే కోరిక… ఫైనల్ గా ఎలా తీరిందో శ్రీరామ్ చెప్పడం ఈ ఎపిసోడ్ మొత్తానికీ ఓ హైలైట్. ఈ జనరేషన్ సింగర్స్ లోనే కాదు యూత్ లో కూడా ఓ ఉత్తేజాన్ని నింపే సంఘటన అది.
శ్వేత వర్మ – హమీదా… శ్రీరామ్ మొగ్గు ఎవరివైపు!?
శ్రీరామ్ వ్యక్తిగత విషయాలను సైతం సాకేత్ బాగానే రివీల్ చేశాడు. ఇండియన్ ఐడిల్, బిగ్ బాస్ సీజన్ 5 ఈ రెండింటిలో దేని తర్వాత ఎక్కువ ప్రపోజల్స్ వచ్చాయని ప్రశ్నించాడు. అలానే కిల్, మ్యారేజ్, హుకప్ ట్యాగ్ సిరి, హమీదా, శ్వేతవర్మలో ఎవరికి ఏది ఇస్తావని ఆరా తీశాడు. ‘తన కాలు డ్యామేజ్ కావడం వెనుక సిరి కూడా కారణం కాబట్టి ఆమెకు కిల్ కేటగిరి ఇస్తానని చెప్పాడు శ్రీరామ్. శ్వేత వర్మ ను పెళ్ళాడతానని, ఆమె సోల్ ఫుల్ పర్సన్ అని కితాబిచ్చాడు. ఇక బిగ్ బాస్ లో ఓ సపరేట్ లవ్ ట్రాక్ ను మెయిన్ టైన్ చేసిన హమీదా గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని, అందుకే ఆమెను హుకప్ చేస్తానని తెలిపాడు. ఇదే సందర్భంలో శ్రీరామ్ గురించి తన మనసులో మాట చెబుతూ శ్వేత వర్మ పంపిన వీడియోను ప్లే చేశారు. తామిద్దరం ఒకరి ఒకరు జోయ్ అని పిలుచుకుంటామని శ్వేత చెబుతూ శ్రీరామ్ లో తనకు నచ్చే అంశాలను తెలిపింది.
సింగిల్ డే జాబ్… హారర్ మూవీస్!!
ఇక్కడ హైదరాబాద్ లో, అక్కడ ముంబైలోనూ కూడా శ్రీరామ్ సింగిలే! ఫ్లాట్ లో ఒక్కడే ఉంటూ కూడా హారర్ మూవీస్ ను చూసి ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలవతుంది. హారర్ మూవీస్ చూసిన తర్వాత శ్రీరామ్ పరిస్థితి ఏమిటనేది ఈ షోలో రివీల్ అయ్యింది. అంతేకాదు శ్రీరామ్ ఒకానొకప్పుడు జాబ్ కూడా చేశాడు. కానీ అది ఒకే ఒక్క రోజు. ఆ జాబ్ ఎందుకు మానేశాడు? జీవితంలో ఉద్యోగం అనే పదం ఎందుకు ఎత్తకూడదని అనుకున్నాడు? ఆ విషయాలనూ శ్రీరామ్ చెప్పాడు. ఇంకో విశేషం ఏమంటే శ్రీరామ్ ఎంత ఇంట్రావర్ట్ అయినా… అతనిలోనూ రొమాంటిక్ యాంగిల్ ఉంది. ఆసక్తికరంగా సాగిన మూవీ డైలాగ్స్ మారథాన్ లో ఓడిపోయిన శ్రీరామ్ ను మిక్స్డ్ ‘షకీలా షాట్స్’ తీసుకోమని సాకేత్ కోరాడు. ‘షకీలా షాట్స్ అని చెబుతూ ఇంత చిన్నవి పెట్టారేంటీ?’ అంటూ పంచ్ వేశాడు శ్రీరామ్! ఫోటోస్ ను చూసి పాటలను గెస్ చేయడంలోనూ, ర్యాపిడ్ ఫైర్ లోనూ శ్రీరామ్ తనలోని ఫైర్ ను చూపించాడు. పనిలో పనిగా శంకర్ మహదేవన్ పట్ల తనకున్న గౌరవభావాన్ని చాటుకున్నాడు. తన సంగీత గురువులు శ్రీమతి లలిత, శ్రీమతి హరిప్రియ ఫోటో చూపించగానే కాస్తంత ఎమోషన్ కు గురయ్యాడు. మొత్తం మీద వేలెంటైన్స్ డే సందర్భంగా చేసిన ఈ ఎపిసోడ్… సమ్ థింగ్ స్పెషల్ గా అనిపించింది. మరి ఇంకెందుకు ఆలస్యం… మీరూ ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చూసేయండీ….