Site icon NTV Telugu

SVP Song Leaked : పనిస్తే ఇలాంటి పని… వాడికి తెలియాలంటూ తమన్ ఎమోషనల్

thaman

మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా పాటలను ప్రత్యేకంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ లీకుల సమస్య మేకర్స్ ను తలలు పట్టుకునేలా చేస్తోంది. సినిమా నుంచి ‘కళావతి’ అనే మొదటి పాట ఈ ప్రేమికుల రోజున విడుదల కావాల్సి ఉంది. ఈ పాటకు సంబంధించి విడుదలైన చిన్న ప్రోమో కూడా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈఅయితే అనూహ్యరీతిలో నిన్న ‘కళావతి’ మొత్తం పాట ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. దీంతో “సర్కారు వారి పాట”టీంతో పాటు మహేష్ అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఇక ఆ సాంగ్ ను కంపోజ్ చేసిన తమన్ గుండె పగిలిపోయింది అంటూ సాంగ్ లీక్ కావడంపై ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఈ పాటకు ఎంతో మంది టాప్ టెక్నీషియన్లు పని చేశారని, పైరసీ అవడం తన మనసును బద్దలు కొట్టిందని ఆడియో నోట్‌లో చాలా ఎమోషనల్‌గా చెప్పాడు.

Read Also : Leak : “సర్కారు వారి పాట” టీమ్ కు షాక్… సాంగ్ లీక్

“రాత్రి పగలు తేడా లేకుండా, కరోనా ఉన్నప్పటికీ 6 నెలల పాటు కష్టపడ్డాము. ఈ సాంగ్ షూటింగ్ చేసినప్పుడు 9 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎంతోమంది కష్టం ఈ సాంగ్… నిర్మాత పెట్టుబడి, మా పాటలో ఉండే ప్రాణం, మా కవి రాసిన లిరిక్స్, మేము మా హీరోకు చూపించాల్సిన ప్రేమ, మా దర్శకుడు సంతోషంగా చేసిన లిరికాల్ వీడియో… ఇక ప్రపంచంలోనే మాస్టర్ మిక్సింగ్ టెక్నాలజీని వాడాము. ఎవడో ఎంతో ఈజీగా ఈ సాంగ్ ను లీక్ చేసి మా కష్టాన్ని నాశనం చేశాడు… వాడికి పనిస్తే ఇలాంటి పని చేశాడు” అంటూ తమన్ చెప్పిన హార్ట్ బ్రేకింగ్ వర్డ్స్ చూస్తే ఈ సాంగ్ లీక్ వల్ల ఆయన ఎంత బాధ పడుతున్నారో తెలుస్తోంది.

Exit mobile version