Music Director Koti : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు మద్దతుగా కొందరు కీరవాణిపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కీరవాణి చిన్న పిల్లలను తీసుకురమ్మంటారని దుమారం రేపారు. కీరవాణిపై ఫోక్సో పెట్టాలంటూ డిమాండ్ చేశాడు. గీతాకృష్ణ చేసిన ఆరోపణలపై తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి స్పందించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. ‘గీతాకృష్ణ గారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మీరు ఎన్నో మంచి సినిమాలు తీశారు. ఎందరికో ఉపాధి చూపించారు. అలాంటి మీరు ఈ నడుమ కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు. కీరవాణి, సింగర్ సునీత, చంద్రబోస్ గురించి మీరు మాట్లాడిన మాటలు చాలా బాధ కలిగించాయి.
Read Also : Gymkhana Director : గంజాయితో దొరికిన జింఖానా డైరెక్టర్ అరెస్ట్..
కీరవాణి గారు ఎంతో కష్టపడి పైకి వచ్చారు. అంత ఆషామాషీగా ఆయన ఈ స్థాయికి రాలేదు. ఎన్నో కష్టాలతో ఎదిగారు. సునీత కూడా చాలా కష్టపడి ఎన్నో పాటలు పాడి ఈ రోజు జడ్జి స్థాయికి వచ్చింది. అలాంటి వారి మీద ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. దయచేసి ఇలాంటి మాటలు ఆపేయండి. ప్రతి షో మీద ఏదో ఒక ఆరోపణలు వస్తాయి. అందులో నిజం ఎంత అనేది తేల్చకుండానే ఇలాంటి మాటలు చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటివి ప్లీజ్ ఆపేయండి. ఇక నుంచి మాట్లాడొద్దు’ అంటూ కోటి కామెంట్స్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఇప్పటికే ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు. ఇప్పటికీ వరుస ప్రోగ్రామ్స్ కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
