సినిమాలని కథలు హిట్ అయ్యేలా చేస్తాయి, హీరోలు హిట్ అయ్యేలా చేస్తారు, డైరెక్టర్లు హిట్ అయ్యేలా చేస్తారు… ఈ హిట్స్ ని తన మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తున్నాడు అనిరుద్. ఈ మ్యూజిక్ సెన్సేషన్ విక్రమ్, జైలర్ ఇప్పుడు జవాన్ సినిమాలకి ప్రాణం పోసాడు. అనిరుద్ లేని ఈ సినిమాలని ఊహించడం కూడా కష్టమే. యావరేజ్ సినిమాని కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేస్తున్న అనిరుద్, ప్రెజెంట్ ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్. అనిరుద్ మ్యూజికల్ అనే పేరుని చూసి కూడా ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు అంటే ప్రస్తుతం అనిరుద్ ఉన్న ఫామ్ ఎలాంటిదో అర్ద చేసుకోవచ్చు. పీక్ స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్న అనిరుద్… ఇలాంటి గోల్డెన్ ఫేజ్ లో చేస్తున్న ఏకైక తెలుగు సినిమా ‘దేవర’ మాత్రమే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ దేవర సినిమా తెరకెక్కుతుంది. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న దేవర సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అనౌన్స్మెంట్ వీడియోకి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది. కొరటాల శివ మార్క్ ఎలివేషన్స్ కి, ఎన్టీఆర్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కి అనిరుద్ మ్యూజిక్ కొడితే థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ని దొమ్మలు అదరడం గ్యారెంటీ. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనిరుద్ పై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అనిరుద్ జైలర్ రేంజులో దేవరకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొడితే చాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ పడినట్లే. మరి ఈ సముద్ర వీరుడికి, మ్యూజికల్ సెన్సేషన్ ఎలాంటి ఆల్బమ్ ఇస్తాడో చూడాలి.