NTV Telugu Site icon

Raghuram passes away: సినీ ఇండస్ట్రీకి షాక్.. కామెర్ల వ్యాధితో యువ సంగీత దర్శకుడు మృతి

Raghuram 1

Raghuram 1

Raghuram passes away: మానవ దేహంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయంలో తయారయ్యే బైలురుబిన్ అధికంగా రక్తంలోకి విడుదలైనప్పుడు కళ్లు, చర్మం, గోర్లు పచ్చగా కనిపిస్తాయి. ఈ పరిస్థితిని పచ్చ కామెర్లు అంటారు. అయితే కొందరు కామెర్ల వ్యాధిని తేలికగా తీసుకుంటారు. దీంతో ఈ వ్యాధి కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంది. తాజాగా తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కామెర్ల వ్యాధితో మృతి చెందడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జాండిస్ బారిన పడిన రఘురామ్ శరీరంలో కొద్దిరోజుల వ్యవధిలోనే కామెర్ల వ్యాధి వేగంగా వ్యాపించింది. దీంతో కనీసం నడవలేని స్థితికి చేరాడు. రోజురోజుకూ ఆరోగ్యం మరింత క్షీణించి చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచాడు.

Read Also: Myositis: సమంతకు వచ్చిన ‘మయోసైటిస్’ వ్యాధి అంటే ఏమిటి? లక్షణాలు ఎలా ఉంటాయి?

కాగా యువ సంగీత దర్శకుడు రఘురామ్ మృతి చెందడం తమిళ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటివరకు రఘురామ్ మూడు సినిమాలకు సంగీతం సమకూర్చాడు. 2011లో రివైండ్, ఆసై అనే తమిళ సినిమాలకు సంగీతం అందించిన అతడు.. 2017లో ఒరు కిదయిన్ కరుణై మను అనే మూవీకి స్వరాలను అందించాడు. సింగర్, లిరిక్ రైటర్‌గానూ రఘురామ్ పలు సినిమాలకు పనిచేశాడు. డియో డియో డిసక, బొంబాయి పోతావ రాజా అనే పాటలతో పాటు జవాన్ మూవీలోని టైటిల్ సాంగ్‌లను రఘురామ్ ఆలపించాడు.

Show comments