NTV Telugu Site icon

Mukesh Khanna: శక్తిమాన్ గా రణవీర్.. ఛీఛీ.. అతను శక్తిమాన్ ఏంటి.. ఒంటిపై బట్టలు లేకుండా..

Shakti

Shakti

Mukesh Khanna: ఇప్పుడంటే చిన్నపిల్లలు చూడడానికి చాలా వీడియో గేమ్స్, షోస్ వచ్చాయి కానీ, అప్పట్లో చిన్న పిల్లలు చూసిన ఒకే ప్రోగ్రామ్ శక్తిమాన్ . ఈ ప్రోగ్రామ్ కోసం పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎదురుచూసేవారు. చాలామంది చిన్నపిల్లలు తమను కాపాడడానికి శక్తిమాన్ వస్తాడని.. గోడల మీద నుంచి దూకేసిన రోజులు కూడా ఉన్నాయి. అంతలా శక్తిమాన్ పిల్లల మనస్సులో కొలువుండి పోయింది. ఇక శక్తిమాన్ గా నటించిమెప్పించిన నటుడు ముకేశ్ ఖన్నా. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ముకేశ్.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. తనకు నచ్చని విషయం అయితే నిర్మొహమాటంగా సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పుకొస్తాడు. ఇక గత కొన్నిరోజులుగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్.. శక్తిమాన్ గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు కాస్తా ముకేశ్ వద్దకు వెళ్లగా .. ఆయన దీనిపై స్పందించాడు.

” నేను ఈ వార్తలపై స్పందించకూడదనే అనుకున్నాను. కానీ,నోరు విప్పక తప్పడంలేదు. ఇప్పటికే చాలామంది ఈ వార్తలను ఖండిస్తున్నారు. ఇంకొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా ఇప్పటివరకు మౌనం వహించాను. కానీ, ఎప్పుడైతే ఛానల్స్‌ కూడా రణ్‌వీర్‌ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని ప్రచారం మొదలుపెట్టాయో.. అ‍ప్పుడే ఇక నోరు విప్పక తప్పదని నిర్ణయించుకున్నాను. అయినా ఒంటిమీద నూలు పోగు లేకుండా ఫోటోషూట్లు చేసే వ్యక్తి శక్తిమాన్‌గా కనిపిస్తాడా? .. ఎంత పెద్ద స్టార్ అయితే ఏంటి లాభం. శక్తిమాన్ అంటే సూపర్ హీరో కాదు.. సూపర్ టీచర్ అని నొక్కి చెప్తున్నాను. రణవీర్.. నీకు నచ్చిన సినిమాలు నువ్వు చేసుకో.. కావాలంటే నిరంతలతో నేను మాట్లాడతాను. ఒక హీరో ఏదైనా పాత్ర చేస్తే జనాలు నమ్మాలి. వారు మాట్లాడితే నిజమనుకోవాలి. కొంతమంది పేరుకే స్టార్ హీరోలు.. కానీ ఇమేజ్ మాత్రం చాలా తక్కువ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments