Site icon NTV Telugu

Geetha Shankaram: గుప్పెడంత మనసు ముఖేష్‌గౌడ హీరోగా ‘గీతా శంకరం’.. ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

Mukesh Gowda

Mukesh Gowda

Mukesh Gowda Geetha Shankaram First look Released: ఎస్‌.ఎస్‌.ఎం.జి ప్రొడక్షన్స్‌ బ్యానర్పై ముఖేష్‌గౌడ, ప్రియాంక శర్మ జంటగా కొత్త దర్శకుడు రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్‌ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘గీతా శంకరం’. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నాడు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రుద్ర మాట్లాడుతూ రెండేళ్లుగా ఈ కథను తెరకెక్కించాలని చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయని, అందరికీ నచ్చే అంశాలతో తెరకెక్కుతోందన్నారు.

Karthi: ఏందీ కార్తీ అన్నా.. జపాన్ అస్సామేనా..?

హీరో ముఖేష్‌గౌడ మాట్లాడుతూ ఈ దీపావళి కానుకగా నేను నటిస్తున్న తొలి సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ అవ్వడం చాలా సంతోషంగా ఉందని, లవ్‌ అండ్‌ ఎఫక్షన్‌తో కూడుకున్న సినిమా అని అన్నారు. సీరియల్స్‌లో ఎలా మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నానో.. ఈ సినిమాతో వెండితెర మీద కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే గట్టి నమ్మకం ఉందని, యూత్‌కు మా ‘గీతా శంకరం’ బాగా నచ్చుతుందన్నారు. హీరోయిన్‌ ప్రియాంక శర్మ మాట్లాడుతూ నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలో నటించే అవకాశం రావడం నేను చాలా అదృష్టంగా ఫీలవుతున్నానని దర్శకుడు రుద్ర డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లో కీలకమైన గీత పాత్రకు నన్ను ఎంచుకోవడం చాలా హ్యాపీగా ఉందన్నారు. దీపావళి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ కావడం మరింత సంతోషంగా ఉందన్న ఆమె ఇలాంటి స్క్రిప్ట్‌ ఓ ఆర్టిస్ట్‌కు రావడం అంత ఈజీగా జరగదని, నాకు రావడం దేవుడి దయ అనుకుంటున్నానని అన్నారు.

Exit mobile version