Karthi: ఏందీ కార్తీ అన్నా.. జపాన్ అస్సామేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ఆవారా నుంచి ఖైదీ వరకు తెలుగు ప్రేక్షకులను కార్తీ అలరించాడు. ఇక ఖైదీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కార్తీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నేడు ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి భారీ నిరాశను మిగిల్చిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఒకదొంగతనం జరగడం ఆ దొంగతనాన్ని ట్రేస్ చేసి రికవరీ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేయడం అనే పాయింట్ మీద జపాన్ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్.
K. Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు..
Also Read
ఇక ఇందులో కార్తీ క్యారెక్టర్ తప్ప వేరే ఏ క్యారెక్టర్ అంతగా ఇంపాక్ట్ కలిగించలేదని అభిమానులు తెలుపుతున్నారు. ఇక పాజిటివ్ అంశం ఏదైనా ఉంది అంటే.. హీరో కార్తీ పాత్ర..దాన్ని మలిచిన తీరు..అది తెర మీదకు తీసుకువచ్చిన వైనం కోసం సినిమాను చూడొచ్చు అని చెప్పుకొచ్చనా.. కథ, కథనం మాత్రం అంత లేదని అంటున్నారు. కార్తీ కోసం సినిమాకు వెళ్ళినా.. కానీ, అంతసేపు కథలేకుండా చూడడం కష్టమని అంటున్నారు. ఇక అను ఇమ్మానుయేల్ పాత్ర అయితే అస్సలు ఏం లేదని, కథను మాత్రం సరిగ్గా చూపించలేకపోయారని అంటున్నారు. దీంతో కార్తీ.. జపాన్ లాంటి కథను ఎంచుకోవడం బాగోలేదని.. ఏందీ కార్తీ అన్నా.. జపాన్ అస్సామేనా..? అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా కలక్షన్స్ ఎలా ఉండనున్నాయో చూడాలి.
తాజావార్తలు
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!