NTV Telugu Site icon

F3 Movie: హమ్మయ్య.. ముఖేష్ గాడి గోల తప్పిందోచ్..!!

F3 Movie Min

F3 Movie Min

ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు వెళ్లినా ప్రారంభంలో ముఖేష్ యాడ్ కనిపించాల్సిందే. ధూమ‌పానం, మద్యపానం గురించి ప్రజ‌ల్ని అప్రమ‌త్తం చేస్తూ ఈ ప్రకటనను సినిమాకు ముందు ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే సినిమాల్లో నటులు పాత్రల స్వభావాన్ని బట్టి సిగరెట్ తాగుతూ మద్యపానం చేస్తూ కనిపించాల్సి వస్తుంది. వారిని ప్రజలు ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రభుత్వం ముందస్తుగా ముఖేష్ యాడ్‌ను చూపించాలనే నిబంధనను విధించింది. అయితే F3 సినిమాకు ముఖేష్ యాడ్ గోల కనిపించదు.

Shekar Movie: రాజ’శేఖర్’ సినిమాకు షాక్.. ప్రదర్శనలు నిలిపివేత

ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి క్లీన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. అందుకే సిగరెట్, మద్యం వంటి సన్నివేశాలను సినిమాలో చూపించలేదట. దీంతో సెన్సార్ సభ్యులు కూడా క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేశారు. కొన్నాళ్లుగా తెలుగులో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు రావడం లేదు. థ్రిల్లర్లు లేకపోతే యాక్షన్ సినిమాలే వస్తున్నాయి. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎలాగైనా థియేటర్లకు రప్పించాలని F3 మూవీ టీమ్ కంకణం కట్టుకుంది. అందుకే నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచడం లేదని కూడా ఇటీవల ప్రకటించారు. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా రన్ టైమ్ కూడా 2 గంటల 20 నిమిషాలుగా ఉంటుందని తెలుస్తోంది.

Show comments