NTV Telugu Site icon

Guntur Kaaram: సాంగ్ వస్తుంది అనే వార్త వినిపిస్తూనే ఉంది… కానీ ఎప్పుడో తెలియదు

Guntur Kaaram

Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ అయినట్లు ఉంది. చాలా రోజులగా డిలే అవుతు వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికి కానుకగా గుంటూరు కారం రిలీజ్ చేయాలనే టార్గెట్‌గా షూట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కేవలం మాస్ స్ట్రైక్ పేరుతో ఒక చిన్న గ్లింప్స్‌ మాత్రమే రిలీజ్ చేశారు. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు కానీ జస్ట్ పోస్టర్స్‌తోనే సరిపెట్టారు మేకర్స్. అయితే తమన్ మాత్రం ఇప్పటికే అదిరిపోయే ట్యూన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. సాంగ్ కూడా రెడీ అయ్యి… ఫైనల్ మిక్సింగ్ లో ఉందని సమాచారం.

సింగర్ అనురాగ్ కులకర్ణి ఒక వర్షన్ పాడరాని సమాచారం. అక్టోబర్ లో దసరా కనుకుగా ఈ సాంగ్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారనే మాట వినిపిస్తుంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు కానీ దాదాపు దసరా రోజునే సాంగ్ వచ్చే అవకాశముందని సమాచారం. అయితే ఇలా గుంటూరు కారం సినిమా నుంచి మొదటి సాంగ్ బయటకి రానుంది అనే మాట వినిపించడం ఇదే మొదటిసారి కాదు. మహేష్ బాబు బర్త్ నుంచి వినాయక చవితి వరకూ చాలా సార్లు గుంటూరు కారం సినిమా నుంచి మొదటి పాట రిలీజ్ అవుతుంది అనే మాట వినిపించింది కానీ సాంగ్ మాత్రం బయటకి రాలేదు. అందుకే మరి ఈసారి దసరా పండగ రోజైన ఘట్టమనేని అభిమానులకి కిక్ ఇస్తూ గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుందా లేక ఇప్పుడు కూడా రూమర్ గా మాత్రమే మిగిలిపోతుందా అనేది చూడాలి.