Site icon NTV Telugu

LGM Movie: రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోన్న ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీ ‘LGM’

Lgm Movie

Lgm Movie

MS Dhoni Productional Debut LGM Movie Gearing to Release: ఇండియ‌న్ క్రికెటరస్ లో స్టార్ క్రేజ్ సంపాదించిన మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారన్న సంగతి తెలిసిందే. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ ఏర్పాటు చేసి ఆయ LGM సినిమాను రూపొందిస్తున్నారు. త‌మిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి విడుద‌ల చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ధోని భార్య సాక్షి నిర్మిస్తున్నారు. ఇక ఈ మధ్యనే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను కూడా పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ను, ఆడియో విడుద‌ల చేయ‌టానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషనల్ కార్య‌క్ర‌మాలలో మ‌హేంద్ర సింగ్ ధోని, సాక్షి ధోని పాల్గొన‌నున్నారు. Scam Alert: YouTube వీడియోలను ‘లైక్’ చేస్తే డబ్బు ఇస్తామన్నారా? తస్మాత్ జాగ్రత్త..ఎందుకంటే?
ఇక ఈ క్రమంలో ద‌ర్శ‌కుడు ర‌మేష్ త‌మిళ్ మ‌ణి మాట్లాడుతూ ‘‘కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా LGM సినిమా రూపొందిస్తున్నాం, సినిమా నవ్విస్తూనే ప్రేక్ష‌కుల గుండెల‌ను తాకుతుందని అన్నారు. LGM చిత్రానికి ప్రేక్ష‌కులు త‌మ ప్రేమ‌, ఆద‌ర‌ణ‌ను అందిస్తార‌ని భావిస్తున్నానని అన్నారు. ఇక ఇటీవ‌ల విడుదలైన LGM టీజర్ కు అద్భుత‌మైన స్పంద‌న రాగా అన్ని డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌స్లో 7 మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్‌ సాధించింది. ఇక ఈ సినిమాలో యోగి బాబు, మిర్చి విజ‌య్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Exit mobile version