Site icon NTV Telugu

Mrunal Thakur: ఫ్యామిలీ స్టార్ చివరి షెడ్యూల్.. బిజీ బిజీగా మృణాల్ ఠాకూర్

Mrunal Thakur Thumb

Mrunal Thakur Thumb

Mrunal Thakur to join Shoot of Family Star in Chennai: రొమాన్స్ క్వీన్, మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండతో కలిసి ఎంతో ఆసక్తికరమైన ఒక ప్రాజెక్ట్ చేస్తోంది. “ఫ్యామిలీ స్టార్” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇక ఆమె ఫ్యామిలీ డ్రామా “ఫ్యామిలీ స్టార్” చివరి షెడ్యూల్ కోసం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5 న విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన మృణాల్ ఠాకూర్, “హాయ్ నాన్న” మరియు “సీతా రామం” వంటి హిట్‌లలో, వాటిలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకర్షించి సౌత్ లో మంచి గుర్తింపు సంపాదించింది. ఇక మృణాల్ – విజయ్ మధ్య కెమిస్ట్రీ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Deepika Padukone: ప్రెగ్నెంట్ సరే.. కల్కి సంగతి ఏంటి పాప.. ?

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, “విజయ్‌తో జతకట్టడానికి, ఫ్యామిలీ స్టార్ చివరి షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించేందుకు మృణాల్ ఇప్పటికే చెన్నైకి బయలు దేరాడు. ఒక వారం పాటు షూటింగ్, పూర్తిగా చెన్నైలో జరుగుతుంది. మొత్తం స్టార్ క్యాస్ట్ ఈ షూట్ లో పాల్గొననున్నారు. ఏప్రిల్‌ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత దిల్‌ రాజు సంకల్పించిన క్రమంలో అందుకే షూటింగ్‌ని శరవేగంగా పూర్తి చేసేపనిలో ఉన్నారు దర్శకుడు పరశురామ్‌ . విడుదలకు ఇంకా అయిదు వారాలే సమయం ఉండటంతో ప్రమోషన్స్‌ కూడా వెరైటీగా ప్లాన్‌ చేశారని, ఒక పక్క ప్రమోషన్‌ పనులూ, మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు.. అన్నీ సిస్టమేటిగ్గా జరిగేలా ప్లాన్‌ చేశారని అంటున్నారు. ‘గీత గోవిందం’ తరహాలోనే సున్నితమైన పాయింట్‌తో.. వినోదంతో కూడిన ప్రేమకథగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని టాక్. ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా కట్టిపడేస్తాయని చెబుతున్న ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ: కె.యూ.మోహనన్‌, సంగీతం: గోపీసుందర్‌ అందిస్తున్నారు.

Exit mobile version